మోహన్ లాల్ ని వెనక్కి నెట్టిన కొత్త లోక చాప్టర్ 1 .. కలెక్షన్ల సునామీ
భారతీయ చిత్ర పరిశ్రమకి సవాలు విసిరే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సవాలు విసిరిన అరుదైన మలయాళ చిత్రమే 'లోక చాప్టర్ 1 '(Lokah Chapter 1).తెలుగులో 'కొత్త లోక చాప్టర్ 1 'పేరుతో విడుదలైంది. కథ, కథనాలు, సాంకేతికత పరంగా ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మలయాళంలో ఆగష్టు 28 , తెలుగులో ఆగస్టు 29 , తమిళం ఆగస్టు 30 , హిందీ సెప్టెంబర్ 4 న విడుదలైంది.