English | Telugu

అరుదైన రికార్డు అందుకున్న ప్రదీప్ రంగనాథన్

విభిన్న చిత్రాల హీరోగా తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు 'ప్రదీప్ రంగనాథన్'(Pradeep Ranganathan). సహజ నటుడు అనే టాగ్ లైన్ కూడా అభిమానులని నుంచి పొందగా,ఈ నెల 17 న 'డ్యూడ్'(Dude)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ యాక్షన్ కామెడీ గా తెరకెక్కిన డ్యూడ్ తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైంది. రిలీజ్ రోజు నుంచే అన్ని ఏరియాల్లో అశేష ప్రేక్షకాదరణతో దూసుకుపోతు రిలీజ్ రోజు నుంచే రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తుంది.


డ్యూడ్ రీసెంట్ గా 100 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరింది. ఈ విషయాన్నీ అధికారంగా మేకర్స్ అధికారంగా తెలియచేస్తు 'బాక్స్ ఆఫీస్ వద్ద డ్యూడ్ సెంచరీ కొట్టడంతో పాటు దీపావళి సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. కేవలం ఆరు రోజుల్లోనే 100 కోట్ల మార్కుని అందుకోవడంతో పూర్తి రన్నింగ్ లో ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో ఏర్పడింది.

ఇక డ్యూడ్ తో ప్రదీప్ రంగనాథన్ వరుసగా మూడు సార్లు వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా సరికొత్త రికార్డు సృష్టించినట్టయింది. ప్రదీప్ రంగనాథన్ గత చిత్రాలు లవ్ టుడే , రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కూడా 100 కోట్ల మార్కుని అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలు తెలుగులో కూడా విడుదలై విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక డ్యూడ్ కి మంచి కలెక్షన్స్ రావడం వెనక హీరోయిజానికి దూరంగా కథనాలు ఉండటం,ప్రదీప్ రంగనాథన్, మమిత భైజు(Mamitha Baiju)శరత్ కుమార్ నటన ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. కీర్తిశ్వ రన్(Keerthiswaran)దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)సుమారు 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించింది.