English | Telugu
మా సినిమా ఉచితంగా చూసి ఐ ఫోన్ తీసుకెళ్లండి
Updated : Oct 23, 2025
'చూసి చూడంగానే' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ 'వర్ష బొల్లమ్మ'(Varsha Bollamma).ఆ తర్వాత స్వాతి ముత్యం, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై క్యారక్టర్ కి తగ్గ పెర్ ఫార్మెన్స్ ప్రదర్శించే నటిగా గుర్తింపు పొందింది. ఈ చిత్రాల కంటే ముందే తమిళ, కన్నడ భాషల్లో సుమారు పది చిత్రాల వరకు చేసి తన ప్రత్యేకత చాటుకున్న వర్ష బొల్లమ్మ ఇళయ దళపతి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 'బిగిల్' లోని ఫుట్ బాల్ ప్లేయర్స్ లో ఒకరిగా చేసి పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది.
ప్రముఖ ఓటిటి సంస్థ ఈటీవీ విన్(Etv Win)లో వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కానిస్టేబుల్ కనకం'(Constable Kanakam)సీజన్ 1 ఆగస్టు 14 న స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పుడు ఈటీవీ విన్ యాజమాన్యం మళ్ళీ ప్రేక్షకుల కోసం ఉచితంగా స్ట్రీమింగ్ కి రెడీ చేస్తుంది. ఈ నెల 24 , 25 ,26 తేదీల్లో ఈటీవీ విన్ లేదా, వెబ్ సైట్ లో ప్రేక్షకులు కానిస్టేబుల్ కనకం ని ఉచితంగా చూడవచ్చు . యాజమాన్యం ఈ విషయాన్నీ అధికారకంగా తెలుపుతు ఈ సారి కథలో ట్విస్ట్ ఉంది
చంద్రిక ఎక్కడ అనే ప్రశ్న చుట్టూ ఒక ప్రత్యేక మిస్టరీ ఛాలెంజ్ తో ప్రారంభమవుతుంది. ప్రేక్షకులు సీజన్ 1 ని మళ్ళీ వీక్షించి అందులో దాగి ఉన్న క్లూస్ ని కనుక్కొని మీ సమాధానాన్ని ఈటీవీ విన్ ఇనిస్టా లేదా ఎక్స్ లో డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియచెయ్యండి. సరైన సమాధానం చెప్పిన వారికి ఐ ఫోన్ 17 గెలిచే అవకాశం అని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మేఘ లేక, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ప్రేమ్ సాగర్, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ కుమార్(Prashanth Kumar)దర్శకుడు కాగా వెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ నిర్మించారు.