చిరంజీవి కొడుకు కాబట్టే చరణ్ ఇలా ఉన్నాడు.. రామ్ సంచలన వ్యాఖ్యలు!
నెపోటిజం అంటూ కొందరు స్టార్స్ మీద కామెంట్స్ చేయడం చూస్తుంటాం. స్టార్ కి వారసుడు కాబట్టే, స్టార్ అయ్యాడు అంటూ హీరోలని తేలికగా తీసి పారేస్తుంటారు. అయితే వారసత్వం అనేది గ్రాండ్ లాంచ్ కి ఉపయోగపడుతుంది అంతే. ప్రతిభనో, ఏదైనా ప్రత్యేకతనో లేకుండా ఎవరూ స్టార్ కాలేరు. పైగా, ఒక వారసుడు స్టార్ అవ్వడం వెనుక ఎంతో ఒత్తిడిని తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది.