English | Telugu
ఫ్యాన్స్ కి ప్రభాస్ నుంచి బర్త్ డే గిఫ్ట్.. సంబరాల్లో ఫ్యాన్స్
Updated : Oct 23, 2025
నేడు పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)పుట్టినరోజు. అభిమానులకి మాత్రం పండుగ రోజు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు అన్నదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసారు. అభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా హనురాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రం టైటిల్ ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.
'ఫౌజీ'(Fauzi)అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ మేరకు 'ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్' అనే కాన్సెప్ట్ తో ప్రభాస్ లుక్ తో కూడిన ఫౌజీ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో పాటు, పద్మవ్యుహాన్ని జయించిన అర్జునుడు, పాండవ పక్షంలో నిలిచిన కర్ణుడు, గురువు లేకుండానే యుద్ధ కళలో నిపుణుడైన ఏకలవ్యుడు, జన్మతః యోధుడు ఇతనే అంటు కూడా తెలిపింది. దీంతో ఫౌజీ సబ్జెక్టుపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫ్యాన్స్ అయితే సదరు పోస్టర్ తో పాటు ప్రభాస్ క్యారక్టర్ కి సంబంధించి ఇచ్చిన ఎలివేషన్ తో సంబరాల్లో మునిగిపోయారు.
రెండో ప్రపంచ యుద్దం కాలం నాటి ప్రేమకథ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఫౌజీ'లో ప్రభాస్ సరసన ఇమాన్వి(Iamnvi)జత కడుతుంది.ఒకప్పటి అగ్ర హీరోయిన్, సీనియర్ నటి జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా అత్యుత్తమ సాంకేతిక బృందం 'ఫౌజీ' కోసం పని చేస్తుంది. ఈ చిత్రం ప్రారంభమయినప్పటి నుంచే 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.