English | Telugu

Jayam serial : వినాయకుని పూజకి సిద్ధమైన గంగ.. రుద్ర, శకుంతల కలుస్తారా!

జీ తెలుగులోప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -41 లో.. ఇంట్లో వినాయకుడి పూజ చేయించి శకుంతలకి రుద్రపై ఉన్న కోపాన్ని పోగొట్టాలనుకుంటుంది గంగ. అదంతా ఈజీ కాదని ఇషిక, వీరు అంటారు. మనం ప్రయత్నం చేస్తేనే కదా అవుతుందో లేదో తెలిసేదని గంగ అంటుంది. తను వెళ్ళిపోయాక ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ గంగ చాలా ఎక్స్ ట్రా చేస్తుంది.. రుద్ర, శకుంతల అత్తయ్యని కలపాలని ట్రై చేస్తుంది.. అలా జరగకుండా చెయ్యాలని వీరు, ఇషిక అనుకుంటారు.

మరొకవైపు రుద్ర సూపర్ మార్కెట్ లో వినాయక చవితికి ఆఫర్స్ పెట్టండి అని వాటికి సంబంధించిన వివరాలు చెప్తుంటాడు. అదంతా వీరు మనిషి విని వీరుకి ఫోన్ చేసి చెప్తాడు. ఈ రుద్ర గాడు ఏం ఇన్వాల్వ్ అవట్లేదంటూనే ఇలా డెవలప్ చేస్తున్నాడేంటని వీరు అనుకుంటాడు. ఆ తర్వాత పెద్దసారుని తీసుకొని గంగ గుడికి వస్తుంది. నువ్వు ఇంట్లో వినాయకుడికి పూజ చెయ్యడం గొడవకి దారి తీస్తుందనిపిస్తుంది.. భాను వినాయకుడి పూజ చేసేవాడు.. ఎవరు చేసిన శకుంతల ఆక్సెప్ట్ చెయ్యదని పెద్దసారు అంటాడు.

మీకు నాపై నమ్మకం కలగాలంటే ఏం చెయ్యాలని గంగ అడుగుతుంది. ఉన్నట్టుండి ఇక్కడ రుద్ర కనిపించాలని పెద్దసారు అంటాడు. అప్పుడే గంగకి వాళ్ళ అమ్మ కన్పిస్తుంది. దగ్గరికి వెళ్లేసరికి ఉండదు. ఆ తర్వాత రుద్ర గుడిలో కనిపిస్తాడు. రుద్ర గుడిలో కన్పించాడు కాబట్టి నువ్వు పూజ చెయ్యడానికి ఒప్పుకుంటున్నానని గంగతో పెద్దసారు అంటాడు. తరువాయి భాగంలో గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీతో పెద్దసారు మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.