English | Telugu

నవదీప్ కామెంట్స్ తో బాధపడ్డాను.. శ్రీజ సంచలన వ్యాఖ్యలు!

శ్రీజ దమ్మును నవదీప్ "ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి" అన్న కామెంట్స్ బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఎంతలా వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు. ఐతే ఇప్పుడు ఆ కామెంట్స్ మీద నవదీప్ గురించి ఒక ఇంటర్వ్యూలో శ్రీజ కొంత క్లారిటీ ఐతే ఇచ్చింది. (Bigg Boss Agnipariksha)

"బిగ్ బాస్ అగ్నిపరీక్షలో జరుగుతున్నదని అంతా ఆర్గానిక్ గానే చూపిస్తున్నారు. అగ్ని పరీక్ష షో మొత్తాన్ని నడిపించేది నవదీప్ గారే. ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ నన్ను ఎందుకు అలా అన్నారో నాకు తెలీదు. షాకిబ్ కి కల్కికి టాస్క్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్న విషయం నాకు అర్ధమయ్యింది. శ్రీముఖి గారు అన్ ఫెయిర్ గా ఉందా అని అడిగినప్పుడు నేను చెయ్యెత్తాను ముందు. ఎక్కడైనా ఏదైనా అన్ ఫెయిర్ గా ఉంది అంటే నేను ముందు స్టాండ్ తీసుకుంటాను. అలాంటిది నా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నేను సైలెంట్ గా ఎందుకు ఉంటాను. అందుకే అన్ ఫెయిర్ ఎందుకు అనిపించిందో చెప్పాను. నేను దగ్గరనుంచి నవదీప్ గారిని అన్ని ఎపిసోడ్స్ నుంచి చూస్తున్న కదా ఆయన చాలా స్వీట్. మరి ఆ టైంలో ఎందుకు అన్నారో తెలీదు. కానీ నేను కూడా చాలా ఫీలయ్యా ఆయన మాటలకు. నేను తగ్గలేదు. ఎందుకు మరి పిలిపించారు ఊరు నుంచి అని నేను కూడా అడిగాను. ఐతే ఆ టైములో ఎందుకు ఇదంతా అని ఇంకా ఈ విషయాన్నీ అక్కడితో వదిలేసాను. ఐతే షాకిబ్ కి టాస్క్ గురించి క్లియర్ గా చెప్పలేదు కల్కికి చెప్పినట్టుగా. అదే నేను చెపుదాం అనుకున్నా కానీ టైం ఇవ్వలేదు. అందులోనూ నేను మాట్లాడుతున్నా కానీ షాకిబ్ కూడా స్టాండ్ తీసుకోలేదు అందుకే నేను ఇంకా వదిలేసా" అని చెప్పింది శ్రీజ.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.