English | Telugu

Bigg boss 9 Telugu : సెకెండ్ వీక్ కెప్టెన్ గా డీమాన్ పవన్.. పెద్ద ట్విస్ట్!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఓనర్స్ అందరు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. ఇక అప్పుడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. రెంటర్స్ లో అందరు డిసైడ్ అయి ఓనర్స్ కేవలం ముగ్గురే కంటెడర్స్ గా సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. దాంతో మనీష్,భరణి, పవన్ డీమాన్ ని గ్రూప్ డిస్కషన్ ద్వారా సెలక్ట్ చేసుకుంటారు.

మమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోవడానికి రీజన్ ఏంటని ప్రియ, శ్రీజ ఇద్దరు రెంటర్స్ పై కోప్పడతారు. ఆ తర్వాత బిగ్ బాస్ ముగ్గురు కంటెండర్స్ ని కలిసి రెంటర్స్ లో ఒకరికిని కంటెండర్ గా సెలక్ట్ చేసుకోమనగా ముగ్గురు డిస్కషన్ చేసుకొని ఇమ్మాన్యుయల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది. టాస్క్ పేరు.. రంగు పడుద్ది. దీనికి సంఛాలక్ గా రీతు ఉంటుంది.

అందులో మొదటి రౌండ్ కి మనీష్ అవుట్ అవుతాడు. టాస్క్ జరిగేటప్పుడు సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ లాగే ఆట జరిగింది. ఇమ్మాన్యుయల్, భరణి వాళ్ళు ఇద్దరు అసలు కలర్ పూసుకోకుండా మనీష్ కి పూసి అవుట్ చేసారు. భరణి, ఇమ్మాన్యుయల్ కలిసి డీమాన్ పవన్ ని టార్గెట్ చేశారు. సంఛాలక్ మాటని భరణి విననందుకు అతడిని రీతూ అవుట్ చేసింది. ఇక మిగిలింది ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్. అందులో ఇమ్మాన్యుయల్ టీ షర్ట్ కి ఎక్కువ రంగు ఉండడంతో డీమాన్ పవన్ విన్ అయ్యాడు. ఇలా బిగ్ బాస్ రెండవ ఇంటి కెప్టెన్ గా డీమాన్ పవన్ ఎంపికయ్యాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.