English | Telugu
కమెడియన్ యాదమ్మ రాజుకి యాక్సిడెంట్...హాస్పిటల్ బెడ్ పై కాళ్లకు కట్టుతో ...
Updated : Jul 25, 2023
కొంతకాలం నుంచి సెలబ్రిటీస్ ఏదో ఒక ఇన్సిడెంట్ లో గాయాల పాలై హాస్పిటల్ బెడ్ మీదో లేదా హ్యాండ్ స్టిక్స్ పట్టుకుని నడుస్తూ కనిపిస్తున్నారు...నవదీప్, వరుణ్ సందేశ్, రౌడీ రోహిణి ఇలా చాలా మంది కూడా కళ్ళకు గాయాలతో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బుల్లితెర మీద కాస్తో కూస్తూ పేరు తెచ్చుకుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న యాదమ్మ రాజు- స్టెల్లా జంట గురించి మనకు తెలుసు. జబర్దస్త్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమెడియన్ యాదమ్మ రాజు ఒకరు. అటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్స్ లోనో సందడి చేస్తూ ఉంటారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక స్టెల్లా అమెరికా వెళ్లి వచ్చి రీసెంట్ గా "నీతోనే డాన్స్" షోకి వెళ్లారు. ఐతే అక్కడ ఎలిమినేట్ ఐపోయి ప్రస్తుతం మిగతా షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి యాదమ్మ రాజు హాస్పిటల్ గౌన్ లో కాళ్లకు కట్టుతో కనిపించాడు.
స్టెల్లా రాజుని దగ్గరుండి నడిపిస్తూ కనిపించింది. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. "గెట్ వెల్ సూన్ బేబీ..నేను నీ కోసం ఎప్పుడూ ఉంటాను" అని స్టెల్లా దానికి టాగ్ లైన్ పెట్టింది. అలాగే ఇంకో మెసేజ్ లో "రాజుకి యాక్సిడెంట్ అయ్యింది త్వరలోనే కోలుకుంటాడు. రికవరీ మెసేజెస్ పెడుతున్న అందరికీ థ్యాంక్స్" అని చెప్పింది స్టెల్లా. "మీ ఇద్దరికీ దిష్టి కొట్టినట్టుంది..ఆ దిష్టి పోయిందనుకో అక్క...బ్రో నా ఫేవరేట్ కమెడియన్ నువ్వు..టేక్ కేర్" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. జబర్దస్థ్ కమెడియన్ గా యాదమ్మ రాజు ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. లేడీ గెటప్స్ తో స్పాంటేనియస్ డైలాగ్స్ తో అమాయకపు ముఖంతో ఉంటూ తనదైన కామెడీ యాసతో అందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తూ ఉంటాడు.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సినిమాల్లో ఛాన్స్ లు తెచ్చుకుంటున్నాడు యాదమ్మ రాజు.