English | Telugu

కాంట్రాక్ట్ మీద రాజ్ సంతకం తీసుకున్న  కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -177 లో.. కృష్ణమూర్తి, కనకం‌ ఇద్దరు.. కాంట్రాక్ట్ పోయింది. ఆదాయం వచ్చే మార్గం పోయింది. అప్పు తీర్చే అవకాశం పోయిందని బాధపడుతారు. అప్పుడే కావ్యని తీసుకొని రాజ్ రావడం చూసిన కనకం, కృష్ణమూర్తి ఇద్దరు షాక్ అవుతారు. కావ్య పుట్టింటికి రావడం ఇష్టం లేని అత్తింటి వాళ్ళు తనని పుట్టింటికి పంపించేసారని ఇద్దరు తప్పుగా అనుకుంటారు.

ఆ తర్వాత మనం కావ్యని ఇక్కడికి రానిచ్చి తప్పు పని చేసాం.. ఇప్పుడు తన కాపురం ఇలా అయిపోయిందని అనుకొని కావ్య దగ్గరికి కనకం, కృష్ణమూర్తి వెళ్తారు. తప్పు చేసాం అల్లుడు గారు.. నా కూతురిని మళ్ళీ మీ ఇంటికి తీసుకొని వెళ్ళండని రాజ్ తో కృష్ణమూర్తి అంటాడు. కృష్ణమూర్తి మాట్లాడింది రాజ్ కి అర్థం కాదు.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు రాజ్ ని బ్రతిమిలాడుకోవడం చూసిన కావ్య.. ఆపండి మీరు తప్పుగా అనుకుంటున్నారని, తన అత్తింటి వాళ్ళు వాళ్ళింటికి వచ్చి పని చెయ్యడానికి ఒప్పుకున్న విషయం కావ్య చెప్పగానే.. కనకం, కృష్ణమూర్తి‌ ఇద్దరు సంబరపడిపోతారు. రాజ్ ని ఇంట్లో కి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళమంటారు. మరొక వైపు కావ్యని తన పుట్టింట్లో డ్రాప్ చెయ్యమని రాజ్ కి సీతరామయ్య చెప్పడం నచ్చని అపర్ణ వచ్చి సీతారామయ్యని మీరు అలా ఎందుకు చెప్పారని అడుగుతుంది.‌ వాళ్ళు భార్యభర్తలని కావ్యకి సపోర్ట్ ఇస్తూ సీతరామయ్య మాట్లాడేసరికి అపర్ణ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొక వైపు అజ్ఞాత అభిమాని కోసం మళ్ళీ కళ్యాణ్ కవిత రాయాలని డిసైడ్ అవుతాడు. మరొకవైపు ఇప్పటికే కోపంగా ఉన్న అపర్ణ దగ్గరికి వెళ్లి.. ఇంకాస్త కావ్యపై కోపం కలిగేలా చెయ్యాలని రుద్రాణి వెళ్తుంది. ఒక్కసారి రాజ్ అత్తారింటికి వెళ్లినందుకే అందరూ కలిసి రాజ్ ని తన వైపుకి తిప్పుకున్నారు. ఇక మళ్ళీ వెళ్ళాడు. కావ్య మాట రాజ్ వినడం స్టార్ట్ చేస్తే నీ పరిస్థితి ఏంటో అని రుద్రాణి అనగానే.. నా కొడుకు అలాంటి వాడేం కాదని అపర్ణ చెప్పి వెళ్ళిపోతుంది.

మరొక వైపు కావ్య ఇచ్చిన ఉప్మా తినలేక రాజ్ ఇబ్బంది పడుతుంటాడు. నువ్వు తినట్లేదు ఏంటో అని రాజ్ అనగానే.. ఛీ నేను తిననని కావ్య అనగానే.. అంటే నేనే బకరానా? నువ్వు కూడా తినాలంటూ బలవంతంగా కావ్యకి తినిపిస్తుంటే.. ఇక దూరం నుండి చూస్తున్న కనకం, కృష్ణమూర్తి ఇద్దరు చూసి.. ప్రేమగా తినిపిస్తున్నాడేమో అని పోరపాటు పడుతారు. ఆ తర్వాత శ్రీనివాస్ వచ్చి కాంట్రాక్ట్ మళ్ళీ ఇస్తున్నట్లు చెప్తాడు. మీరు అగ్రిమెంట్ రాసి ఇస్తేనే ఈ కాంట్రాక్టు తీసుకుంటానని కావ్య బెట్టు చేస్తుంది. చేసేదేమీ లేక శ్రీనివాస్ అగ్రిమెంట్ రాసి ఇస్తాడు.. ఆ తర్వాత అగ్రిమెంట్ మీద రాజ్ సాక్షి సంతకం పెడతాడు. కాసేపటికి రాజ్ ఉప్మా తినలేక బయటకు వెళ్తుంటే.. కావ్య వెనకాల వెళ్తుంది. రాజ్ మట్టిలో అడుగేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.