English | Telugu
కృష్ణ జ్ఞాపకాలలో మురారి ఉక్కిరిబిక్కిరి!
Updated : Aug 19, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -239 లో.. మురారితో ఉన్న జ్ఞాపకాలని కృష్ణ గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు మురారి కూడా వెళ్తు దార్లో ఎవరు కనిపిస్తే వాళ్ళని కృష్ణ అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి కృష్ణ కృష్ణ అంటూ పిలిచేసరికి వాళ్ళు మురారిపై కోపంగా ప్రవర్తించిడంతో మురారి బాధపడతాడు.
మరొక వైపు కృష్ణకి క్యాంపు దగ్గర మురారి వచ్చి పిలిచినట్లుగా అనిపించి పరుగున వచ్చి చూస్తే అక్కడ మురారి ఉండడు. ఇలా ఇద్దరు ఒకరినొకరు ఉహించుకుంటూ ఎమోషనల్ అవుతుంటారు. మరొక వైపు రేవతి కోపంగా కూరగాయలు కట్ చేస్తూ.. నీ గుర్తుగా నాకు సీతరాముల విగ్రహం ఇస్తావా అని రేవతి అనుకుంటుంది. మరొక వైపు మధు, ప్రసాద్ ఇద్దరు కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. కృష్ణ ఎమోషనల్ పర్సన్ అని ప్రసాద్ అంటాడు. మరోక వైపు అలేఖ్య, సుమలత ఇద్దరు కృష్ణ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కృష్ణ రాసిన లెటర్ ని భవాని గుర్తుచేసుకుంటుంది. ఈ తింగరి పిల్ల ఏంటీ పది రోజుల్లో వచ్చేదానికి అందరికి గిఫ్ట్స్ ఎందుకు ఇచ్చిందని అనుకోని అసలు కృష్ణ ఇచ్చిన పెన్ డ్రైవ్ లో ఏముందని మధుని పిలిచి ప్లే చేయమని చెప్తుంది. ఇంట్లో అందరు హాల్లో కి వచ్చి.. కృష్ణ ఇచ్చిన పెన్ డ్రైవ్ లో ఏముందో చూస్తారు. కృష్ణ ఇంట్లో అందరి గురించి ఆ పెన్ డ్రైవ్ లో చెప్తుంది. మధు నువ్వు మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకో అని మోటివేట్ చేస్తుంది. ఇలా ఒక్కక్కరి గురించి వాళ్లకి మోటివేషన్ వచ్చేలా మంచి మాటలు చెప్తుంది.
ఆ తర్వాత టీవీలో ఒక న్యూస్ వస్తుంది. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణం అంటూ వచ్చేసరికి అందరు ఆదర్శ్ గురించి టెన్షన్ పడతారు. మరొక వైపు కృష్ణ తన బిజీలో తను ఉంటు వచ్చిన పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. మురారి మాత్రం కృష్ణ జ్ఞాపకాలతో గడుపుతుంటాడు. కృష్ణని తలుచుకొని గట్టిగా అరుస్తుంటాడు. కృష్ణకి మురారి ఫోన్ చేస్తూ ఉంటాడు. కృష్ణ బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.