English | Telugu
రిషిపై ఏంజిల్ మనసులో ప్రేమ మ్యూజిక్.. కారణం వసుధారేనా!
Updated : Aug 18, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -844 లో.. ఏంజిల్ మనసులో ఎవరైనా ఉన్నారేమో అని రిషిని కనుక్కోమని విశ్వనాథ్ చెప్తారు. దాంతో ఆ విషయం సూటిగా ఏంజిల్ ని అడగలేక వసుధారతో రిషి అడిగిపించాలనుకుంటాడు. అదే విషయం వసుధారకి చెప్తే.. మీ ఫ్రెండ్ కదా మీరే అడగండి.. నేను అడగను అంటూ కావాలనే రిషిని సరదాగా అటపట్టిస్తుంది వసుధార.
ఆ తర్వాత వసుధార ఇంటికి వెళ్లి.. రిషితో దిగిన ఫొటోస్ చూస్తూ మురిసిపోతుంది. పొరపాటున ఒక ఫోటో రిషికి పంపించి డిలేట్ చేస్తుంది. అది చూసిన రిషి ఏంటో ఏదో పంపించి డిలేట్ చేసిందని ఏం పంపించిందో ఏంజెల్ ద్వారా కనుకుంటానని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత ఏంజిల్ కి వసుధార కాల్ చేసి.. పెళ్లి గురించి ఏం ఆలోచించావ్? నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. ఇక ఏంజిల్ ప్రస్తుతం ఈ జనరేషన్ లో పర్ఫెక్ట్ అబ్బాయిలు ఎక్కడ ఉన్నారని అనగానే.. ఎందుకు ఉండరు, ఉంటారు నా జెంటిల్ మెన్ రిషి సర్ ఉన్నారుగా అని వసుధార తన మనసులో అనుకుంటుంది. ఏంజెల్ పర్ఫెక్ట్ వాళ్ళుంటారు. మన చుట్టూనే ఉంటారని వసుధార అనగానే.. ఏంజిల్ దగ్గరికి రిషి వస్తాడు. అప్పుడే రిషిని ఏంజిల్ ఎన్నడూ చూడని విధంగా ప్రేమగా చూస్తుంది. వసుధార అన్న మన చుట్టూనే ఉంటారన్నే మాటలు గుర్తుచేసుకుంటూ.. రిషినే చూస్తంటుంది ఏంజిల్. మరొకవైపు ఏంటి ఏంజిల్ ఫోన్ కట్ చేసిందని వసుధార అనుకుంటుంది. ఎట్టకేలకు వసుధార వల్లే ఏంజిల్ మనసులో లవ్ మ్యూజిక్ ప్లే అయింది. పాపం వసుధార తన ప్రేమని తనే నాశనం చేసుకునేలా ఉంది.
మరొక వైపు DBST కాలేజీలో మీటింగ్ జరుగుతుంది. కాలేజీ లో అడ్మిషన్స్ పెంచాలని అనుకుంటారు. ఇంకా పేపర్ లో వచ్చిందాని గురించి.. అది కావాలని ఎవరో ఇలా చేసారని ఫణింద్ర కోప్పడతాడు. అప్పుడే విష్ కాలేజీ నుండి పాండియన్, అతని స్నేహితులు వెళ్లి సపోర్ట్ స్టూడెంట్స్ గురించి చెప్పి కొంతమందిని మీ కాలేజీలో జాయిన్ చేయడానికి వచ్చామని చెప్తారు. కానీ వాళ్ళని పంపింది మాత్రం రిషి నే, జగతి మహేంద్రలకు ఆ కాన్సెప్ట్ రిషిదే అని తెలుసు. అందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు విశ్వనాథ్ దగ్గరికి ఏంజిల్ వస్తుంది. పెళ్లి గురించి విశ్వనాథ్ అడగగానే.. రిషి గురించి చెప్పలేక సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.