English | Telugu
కొండల్లో, గుట్టల్లో తన కోసమే ఒంటరిగా తిరిగేస్తున్న దివి!
Updated : Aug 18, 2023
దివి వాధ్యా ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. బిగ్ బాస్ -4 సీజన్లో అడుగుపెట్టిన దివి.. ఆ షోలో తన అందాలతో యూత్ ని తనవైపు తిప్పుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోస్ ని షేర్ చేస్తున్న ఈ భామ.. ఫ్యాన్ బేస్ పెంచుకుంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీలో తళుక్కుమన్న ఈ భామ.. అడపాదడపా షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. కాగా A1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా వచ్చిన 'ఏటీఎమ్' వెబ్ సిరీస్ లో తన అందాలతో ప్రేక్షకులను ముగ్దుల్ని చేసిన ఈ భామకు.. యాక్టింగ్ కి స్కోప్ లేకుండా కేవలం అందాల ఆరబోతకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయనే చెప్పాలి. ఇన్ స్టాగ్రామ్ లో కూడా హాట్ ఫొటోలతో కుర్రకారు మతులు పోగొడుతోంది.హాట్ పిక్స్ తో ఎప్పటికప్పుడు యూత్ ని ఆకట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది దివి.
దివికి ఇన్ స్టాగ్రామ్ లో క్రేజ్ మాములుగా ఉండదు. తను ఏ చిన్న పోస్ట్ చేసిన వేలల్లో లైక్స్, లక్షల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వస్తుంటాయి. అయితే తన అందానికి ముగ్ధులైనవాళ్ళు ఎక్కువగా పాజిటివ్ కంటే నెగెటివ్ గానే కామెంట్లు చేస్తుంటారు. అయితే తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది. ఇందులో కొండల్లో, గుట్టల్లో తిరుగుతూ కన్పిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లతో బిజీగా ఉండే ఈ భామ.. ఇప్పుడు కొండల్లోకి, గుట్టల్లోకి దివి ఎందుకు వెళ్ళిందా అనే ప్రశ్నలు ఈ పోస్ట్ కింద వస్తున్నాయి. తనతో ఎవరో ఉన్నారని ఒకరు, ఎందుకింత అందంగా ఉన్నావని మరొకరు ఇలా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దివి ఈ వీడియోని ' నిన్ను తలుస్తూ కొండల్లో, గుట్టల్లో ఒంటరిగా తిరిగేస్తున్నా' అనే క్యాప్షన్ తో షేర్ చేసింది. కాగా ఇప్పుడు దివి చేసిన ఈ పోస్ట్ ట్రెండింగ్ లో ఉంది.