English | Telugu

ట్రెండింగ్ లో ఆదిరెడ్డి కొత్త వ్లాగ్.. అదిరిందిగా!

ఆదిరెడ్డి.. బిగ్ బాస్ తో ఫేమ్ లోకి వచ్చిన యూట్యూబర్. అదిరెడ్డి బిగ్ బాస్ అంటే ఇష్టంతో.. ఇప్పటిదాకా అన్ని సీజన్లకి రివ్యూ ఇచ్చాడు. అతను ఇచ్చిన రివ్యూస్ కి లక్షల్లో వ్యూస్ వచ్చేవని అనడంలో ఆశ్చర్యమే లేదు. ఒక యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ లోంచి బయటకొచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరూ టీవీ రంగంలోకి లేదా సినిమాలలోకి వెళ్ళాలని చూస్తారు. అయితే ఆదిరెడ్డి మాత్రం దానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఫేమ్ వచ్చిన కూడా తను ఉన్న ఊరి నుండి వేరొక చోటుకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు.

ఆదిరెడ్డి మొదటి నుండి కష్టపడేతత్వం గల వ్యక్తి. ఇది బిగ్ బాస్ చూసిన ప్రేక్షకులకు తెలిసిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ గా కుటుంబం పట్ల తను చూపించే కేరింగ్.. అతని ఆలోచన విధానానికి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు.. ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ అయిపోయి.. తన యూట్యూబ్ ఛానల్ వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. ఆదిరెడ్డి బిగ్ బాస్ తర్వాతి సీజన్ కి రివ్యూ ఇవ్వనున్నాడు. ఇప్పటికే తన ఇన్ స్టాగ్రామ్ లో బిగ్ బాస్ అప్డేట్స్ ని ప్రేక్షకులకు షేర్ చేస్తున్నాడు ఆదిరెడ్డి.

ఆదిరెడ్డి తన సొంత ఇంటి కలని నిజం చేసుకొనే పనిలో ఉన్నాడు. ఈ మధ్య బిగ్ బాస్ సీజన్-7 గురించి ఇచ్చిన అప్డేట్స్ ఎంతో వీక్షకాధరణ పొందాయి. ఆదిరెడ్డి తన యూట్యూబ్ లో చేసే వ్లాగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ప్రేక్షకులకు మరొక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్పాడు ఆదిరెడ్డి. తన లైఫ్ లోనే మొదటిసారి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసాడు ఆదిరెడ్డి. ఒక సెలున్ స్టార్ట్ చేస్తున్నట్టు.. ఇది అమ్మాయిలకు, అబ్బాయిలకు సంబంధించిన అన్ని రకాల మేకప్ లు ఉంటాయని, బ్యూటీ పార్లర్ అని చెప్పాడు. అయితే తను కొత్తగా మొదలుపెడుతున్న ఈ బిజినెస్ కి అందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ ఆదిరెడ్డి రిక్వెస్ట్ చేసాడు. కాగా తన ప్రారంభించిస్తున్న ఈ కొత్త బిజినెస్ ప్లేస్ నీ చూపించాడు. ఇది ఇంకో నెలలో ఓపెనింగ్ కూడా జరుగుతుందంటూ చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. కాగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.