English | Telugu

రాజ్ ఫోటోలని అపర్ణకి చూపించిన రుద్రాణి.. రచ్చ మళ్ళీ మొదలైనట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -178 లో... రాజ్ ఉప్మా తిననని వెళ్తుంటే రాజ్ వెనకాలే కావ్య వెళ్ళి ఆగండని అంటుంది. రాజ్ చూడకుండా మట్టిలో కాలు వేస్తాడు. అప్పుడే వచ్చిన కనకం, కృష్ణమూర్తి చూస్తారు. దాంతో కావ్య వాళ్ళకి.. మీ అల్లుడు గారు ఏం పని చేసిన తన చేతితో మొదలుపెడతారు. మా అయన ఇప్పుడు కాలుపెట్టి మొదలు పెట్టాలనుకుంటున్నాడని కావ్య రాజ్ ని ఇరికించేస్తుంది.

ఆ తర్వాత రాజ్ ఏం చెయ్యలేక కాళ్ళతో మట్టి పిసుకుతుంటాడు. నువ్వు కూడా అల్లుడికి సాయం చేయమని కనకం అనగానే.. కావ్య సంబరపడుతు రాజ్ తో కలిసి మట్టి తొక్కుతుంది. వాళ్ళు అలా మట్టి పిసకడం చూసిన రాహుల్ కి తెలిసిన రిపోర్టర్ ఫోన్ లో ఫొటోస్ తీస్తాడు. మరొకవైపు అనామిక కోసం కవిత రాస్తే తను ఫోన్ నెంబర్ ఇస్తుందని భావించిన కళ్యాణ్.. ఒక దగ్గర కూర్చొని కవిత్వం రాస్తుంటాడు. మంచి కవిత్వం వచ్చే వరకు పేపర్స్ నీ వేస్ట్ చేస్తూనే ఉంటాడు. ఆ వేస్ట్ చేసిన పేపర్స్ అన్ని ఒక అతను తీసుకొని వెళ్లి అనామికకి ఇస్తాడు. మరొక వైపు రాజ్, కావ్యకి గొడవ పెట్టించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న రాహుల్ కి తన రిపోర్టర్ ఫోన్ చేసి‌.. రాజ్ మట్టిపిసికిన ఫొటోలని పంపిస్తాడు. అవి చూసిన రాహుల్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయ్. రాహుల్ సంతోషంగా ఉండడం చూసిన రుద్రాణి.. నీ ఆనందనికి కారణం ఏంటో అని అడుగుతుంది. అప్పుడు రాజ్ ఫొటోని చూపించగానే రుద్రాణి కూడా సంతోషపడుతుంది. ఈ న్యూస్ నువ్వు మీడియాలో వచ్చేలా చూడు.. నేను ఈ ఇంట్లో యుద్ధం మొదలు పెడుతానని రుద్రాణి అంటుంది. మరొకవైపు కావ్య సాయంత్రం అవుతున్న ఇంటికి వెళ్లకుండా వర్క్ చేస్తానని అంటుంటే.. అవకాశం ఇచ్చారు కదా అని ఇంకా ఎక్కువ చెయ్యకూడదని కనకం అంటుంది. అప్పు వచ్చి.. నువ్వు వెళ్ళు ఏదైనా ఉంటే రేపు వచ్చి చేయమని కావ్యకి కాస్త కోపంగా, కాస్త ప్రేమగా చెప్తుంది.

మరొకవైపు కళ్యాణ్ పిచ్చి కవితలు రాస్తూ వేస్ట్ చేసిన పేపర్స్ అన్ని తీసుకొని వచ్చి చదువుతుంది అనామిక‌. మరొకవైపు రాజ్ విషయం చెప్పి.. ఎప్పుడు గొడవ చెయ్యాలా అని ఎదురు చూస్తున్న రుద్రాణి.. అపర్ణ దగ్గరకి వచ్చి రెచ్చగొట్టేల మాట్లాడుతుంది‌. రాజ్ ఫొటోస్ అపర్ణకి చూపిస్తుంది. ఆ ఫొటోస్ చుసిన అపర్ణ పట్టారాని కోపంతో ఊగిపోతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.