English | Telugu

విజయ్‌ దేవరకొండకి హిట్‌ ఇచ్చేందుకు రంగంలోకి దిగుతున్న హలీవుడ్‌ స్టార్‌!

అర్జున్‌రెడ్డి, గీతగోవిందం వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ఒక్కసారిగా పీక్స్‌కి వెళ్లిపోయిన విజయ్‌ దేవరకొండ కెరీర్‌ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో గాడి తప్పింది. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన టాక్సీవాలా అతనికి చివరి హిట్‌గా చెప్పుకోవచ్చు. 2018లో వచ్చిన ఈ సినిమా తర్వాత దాదాపు అతను నటించిన పది సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో 5 సినిమాల్లో మాత్రమే అతను హీరోగా నటించాడు. మిగతా ఐదు సినిమాల్లో కేమియో రోల్స్‌ చేశాడు. హీరోగా నటించిన 5 సినిమాల్లో ఒక్కటి కూడా హిట్‌ అవ్వలేదు. దీంతో అతని కెరీర్‌ అయోమయంలో పడిరది.

మళ్లీ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చేందుకు విజయ్‌ దేవరకొండ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కథల ఎంపికలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కాన్సెప్ట్‌ పరంగా కొత్త ప్రయోగాలు చేసినా తన పూర్వ వైభవం తెచ్చుకోలేకపోయాడు. పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో చేసిన ‘లైగర్‌’పై ఎన్నో హోప్స్‌ పెట్టుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ఎంతో భారీగా నిర్మాణం జరుపుకొని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అయిన ఈ సినిమా అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ని రంగంలోకి దించారు. అది కూడా అతనికి కలిసి రాలేదు.

‘లైగర్‌’ తర్వాత విజయ్‌ దేవరకొండ చేసిన ఖుషి, ది ఫ్యామిలీ స్టార్‌, కింగ్‌డమ్‌ చిత్రాలు కూడా అతనికి ఆశించిన స్థాయి విజయాల్ని అందించలేకపోయాయి. దాంతో తర్వాత చేసే సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘టాక్సీవాలా’తో తనకు చివరి హిట్‌ని అందించిన రాహుల్‌ సంకృత్యాన్‌తో మరో భారీ సినిమా చేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నుంచి ఒక స్టార్‌ విలన్‌ని రంగంలోకి దింపుతున్నాడు రాహుల్‌. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1999లో అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మమ్మి’ చిత్రంలో విలన్‌గా నటించి అందర్నీ ఆకట్టుకున్న అర్నాల్డ్‌ వోస్లూ టాలీవుడ్‌కి రాబోతున్నాడు.

‘మమ్మి’ తర్వాత ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో కనిపించిన అర్నాల్డ్‌.. తొలిసారి ఒక తెలుగు సినిమాలో నటించడం అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, అర్నాల్డ్‌ నటిస్తున్న తొలి ఇండియన్‌ మూవీ కూడా ఇదే కావడం విశేషం. విజయ్‌ దేవరకొండకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక సూపర్‌హిట్‌ ఇవ్వాలన్న ధ్యేయంతో రాహుల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 2021లో నాని హీరోగా రాహుల్‌ తెరకెక్కించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రాహుల్‌ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.