English | Telugu

‘అఖండ2’తోపాటు చిరంజీవిగారు, ప్రభాస్‌గారి సినిమాలు కూడా పెద్ద హిట్‌ అవ్వాలి

నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ2’ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కాబోతోంది. ఈ సంందర్భంగా కూకట్‌పల్లిలోని కైతలాపూర్‌ గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన నందమూరి అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా ఈ ఈవెంట్‌ జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘బాలయ్యబాబే మా ఆస్తి, ఆయనే మా పవర్‌, ఆయనే మా దైర్యం. హీరోయిన్‌ సంయుక్త మీనన్‌, ఆది పినిశెట్టి, ఛటర్జీ, మురళీ మోహన్‌, మహేంద్రన్‌, కబీర్‌ సింగ్‌, రచ్చ రవి, హర్షాలీ, పూర్ణ.. ఇలా సినిమాలో నటించిన వారందరికీ థ్యాంక్స్‌. నేను ఎప్పుడూ ఎమోషన్‌ ని నమ్ముతాను. ఆ ఎమోషన్‌తో వచ్చే యాక్షన్‌ని నమ్ముతాను. ఇందులో రామ్‌ లక్ష్మణ్‌, రాహుల్‌, రవి వర్మ అద్భుతమైన ఫైట్స్‌ కంపోజ్‌ చేశారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌ సృష్టికి ప్రతి సృష్టి చేశారు. థమన్‌తో జర్నీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. మన సినిమాకి సెన్సార్‌ పూర్తయింది. యుఎ సర్టిఫికెట్‌ వచ్చింది. సెన్సార్‌ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. మీరు ఈ సినిమాతో ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు అని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. సినిమాకి కులం లేదు, మతం లేదు. సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు, అందరిదీ. మన సినిమా ముందు వస్తున్న సినిమాలు, మన సినిమా తర్వాత వస్తున్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధించాలి. అందరూ సంతోషంగా ఉండాలి. మన సినిమా తర్వాత ప్రభాస్‌ మారుతిల రాజాసాబ్‌ వస్తోంది. ఆ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలి. అలాగే సంక్రాంతికి చిరంజీవిగారి సినిమా వస్తోంది. అది కూడా పెద్ద హిట్‌ అవ్వాలి. మన సినిమా ఒక్కటే కాదు, అందరి సినిమాలు పెద్ద విజయాలు సాధించాలి. అందరూ బాగుండాలి’ అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.