English | Telugu

పెద్ది ఓటిటి డీల్ ఇదేనా!..ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి 


-పెద్ది కి నెట్ ఫ్లిక్స్ కి మధ్య ఏం జరిగింది
-పాజిటివ్ వైబ్రేషన్స్
-చరణ్ ఫ్యాన్స్ హంగామా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)'పెద్ది' నెక్స్ట్ ఇయర్ మార్చి 26 న పాన్ ఇండియా స్థాయిలో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అంటే ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. కానీ
ఇప్పట్నుంచే 'పెద్ది'(Peddi)ఫీవర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో చాలా బలంగా చొచ్చుకొని పోయింది. చికిరి సాంగ్ రిలీజ్ తో అయితే ఆ ఫీవర్ పతాక స్థాయికి చేరడంతో పాటు రికార్డులే తరువాయి అని ముక్త కంఠంతో చెప్తున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో 'పెద్ది' ఓటిటి డీల్ కి సంబంధించిన విషయం అభిమానుల్లో జోష్ ని తెప్పిస్తుంది.


ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ 130 కోట్లరూపాయిల భారీ మొత్తానికి అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ ని కైవసం చేసుకున్నట్టుగా టాక్. ఈ వార్త నిజమైతే కనుక షూటింగ్ పూర్తికాకముందే అంత భారీ మొత్తానికి ఓటిటి డీల్ ని పొందటం ఒక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. కాకపోతే ఈ విషయంపై అధికార ప్రకటన లేదు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గామారడంతో అభిమానులు స్పందిస్తు చరణ్ కి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న క్రేజ్ కి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చనే కామెంట్స్ చేస్తున్నారు.

also read:నేడు సమంత పెళ్లి!.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు


పెద్ది ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ని జరుపుకుంటుంది. భారీ గా వేసిన సెట్ లో చరణ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పై బాలీవుడ్ స్టంట్ మాస్టర్ షామ్ కౌశల్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. సదరు యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలవబోతున్నాయని తెలుస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్దిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు.'ఏఆర్ రెహ్మాన్'(Ar Rehman)కూడా 'చికిరి' కి మించిన ట్యూన్స్ ని సిద్ధం చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్(Sukumar) రైటింగ్స్ సహకారంతో వృద్ధి సినిమాస్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.