English | Telugu

సినీ నటులను హీరోలని పిలవకూడదు.. చంద్రబాబు, రేవంత్ రియాక్షన్ ఏంటి..?

సినీ నటులను హీరోలు అని పిలవడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటారు. సైనికులు, రైతులు నిజమైన హీరోలు అవుతారు కానీ, సినీ నటులు హీరోలు ఎలా అవుతారని ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఇదే విషయంపై తాజాగా ఒక న్యాయవాది.. ఏకంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయడం సంచలనంగా మారింది.

సినీ నటులను హీరోలు అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ పదాన్ని వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. హీరో అనే పదం డ్రగ్స్ కంటే ప్రమాదకరమైందని, బాల్యం నుంచే యువత భవిష్యత్తును ఇది నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులు, అన్నం పెట్టే రైతులు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా సినీ నటులనే గొప్పవాళ్లుగా భావించే పరిస్థితులు నెలకొన్నాయని భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వీరిని లీడ్ యాక్టర్ అని మాత్రమే పిలవాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాక నటులు 200 నుంచి 300 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో సినిమా టికెట్ ధరలు అమాంతం పెరిగాయని, థియేటర్ క్యాంటీన్లలో పది రూపాయల మొక్కజొన్న పేలాలకు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని భానుప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వాలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి, క్యాంటీన్ వస్తువులను ఎంఆర్‌పీ ధరలకే అమ్మేలా ఆదేశించాలని ఆయన కోరారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.