English | Telugu

హృతిక్‌కీ, న‌య‌న్‌కీ పోలికేంటి?

సౌత్ బ్యూటీ నయనతారకి, గ్రీక్‌ గాడ్ హృతిక్ రోషన్ కి మధ్య పోలికలు వెతుక్కుంటుంది నార్త్ మీడియా. లేడీ సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ సినిమాగా పేరు ఉంది నయనతారకి. ఆమెకిప్పుడు 37 ఏళ్లు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం ఆమెది. 18 ఏళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు న‌య‌న్‌. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అతి అద్భుతమైన నటీమణుల్లో ఆమె ఒకరు. హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ గా కూడా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఇన్నేళ్ల తర్వాత ఆమె ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు నయనతార. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ప్రతిదీ నార్త్ లో ఇంట్రెస్టింగ్‌గా ట్రెండ్ అవుతోంది. అందులో భాగంగానే ఆమె ఆరో వేలుకు సంబంధించిన ఓ విషయం వైర‌ల్ అవుతోంది. అందుకు సంబంధించిన‌ ఫోటోలు ఇప్పుడు నార్త్ లో వైరల్ అవుతున్నాయి.

హృతిక్ రోషన్‌కి ఇప్పుడు 47 ఏళ్లు. హృతిక్ రోషన్ కి కూడా చేతికి ఆరు వేళ్లుంటాయి. నయనతార కూడా 6వేళ్లు ఉన్నాయి. వీళ్ళిద్దరికీ సంబంధించిన ఈ విషయాన్ని పోల్చి చూస్తూ వార్తలు రాస్తుంది నార్త్ మీడియా. సోమవారం విడుదలైన జవాన్ ప్రివ్యూ లో నయనతార యాక్షన్ స్టన్స్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడూ ఆమె ప్రయత్నించలేదు. ఎప్పుడో ఒకసారి చిన్న ప్రయత్నం చేసినా, అది చెప్పుకోదగ్గ స్థాయిలో అయితేలేదు. కానీ ఇప్పుడు ఉత్తరాదిన జవాన్ లో ఆమె తన విశ్వరూపం చూపించార‌ని అంటున్నారు జ‌నాలు.

మరోవైపు హృతిక్‌ హీరోగా ఫైటర్ సినిమా తెర‌కెక్కుతోంది. జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. దీంతోపాటు నయనతార కిట్టీలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. కమల్‌హాసన్ సరసన‌ ఆమె తొలిసారి నటించనున్నారు. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తారు.