English | Telugu
ఈ నగరానికి ఏమైంది.. సిగరెట్ తాగుతూ షో హోస్ట్ చేసిన సల్మాన్!
Updated : Jul 10, 2023
అసలే ఓటీటీలలో విడుదలయ్యే కొన్ని సినిమాలు, సిరీస్ లలోని సన్నివేశాలు, సంభాషణలు.. అసభ్యకరంగా, కుటుంబంతో కలిసి చూడలేని విధంగా ఉంటున్నాయి. ఇది చాలదు అన్నట్టుగా ఇప్పుడు ఓటీటీలో ప్రసారమయ్యే షోలలో బాలీవుడ్ స్టార్స్ కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారు. ఏకంగా లైవ్ లో చేతిలో సిగరెట్ పట్టుకొని దర్శనం ఇస్తున్నారు.
హిందీ బిగ్ బాస్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సల్మాన్ ఖాన్. ఎన్నో సీజన్లుగా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 కి కూడా ఆయనే హోస్ట్. ఇటీవలే ఇది ప్రారంభమైంది. అయితే ఈ షోలో ఆయన వేదికపై నిల్చొని కంటెస్టెంట్స్ తో మాట్లాడుతుండగా, ఆ సమయంలో ఆయన చేతిలో సిగరెట్ ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కంటెస్టెంట్స్ కి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నీతులు చెప్పే స్థానంలో ఉన్న సల్మాన్.. ఇలా చేతిలో సిగరెట్ పట్టుకొని హోస్ట్ చేయడం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇలాగే వదిలేస్తే ఓటీటీ నే కదా అని మందుకొడుతూ హోస్ట్ చేసేలా ఉన్నారని మండిపడుతున్నారు. మరి ఈ వివాదంపై సల్మాన్, బిగ్ బస్ హిందీ ఓటీటీ షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.