English | Telugu
ఎమోషనల్‌గా శ్రీదేవి తనయ జాన్వీ మూవీ!
Updated : Jul 11, 2023
జాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా బవాల్. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. దుబాయ్‌లో ట్రైలర్ విడుదల చేశారు. నితీష్ తివారి ఈ చిత్రాన్ని రూపొందించారు. నితీష్ తివారీ మాట్లాడుతూ, ``ఈ చిత్రం చాలా ప్రత్యేకమైంది. ఇందులో మనసును హత్తుకునే విషయాలు చాలానే ఉన్నాయి. ఇది జనాలకు చెప్పాల్సిన కథ. మనం జీవితాన్ని చూసే విధానం, ప్రజలను పలకరించే తీరు గురించి ప్రస్తావించాం. మనల్ని మార్చే కొన్ని జీవిత అనుభవాలు ఉన్నాయి. ఎమోషనల్ లేయర్స్ ఉన్న సినిమా. భారతదేశం, పోలాండ్, నెదర్లాండ్స్, జర్మనీలో షూటింగ్ చేశాం. క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే ట్రైలర్ ముఖ్యోద్దేశం. ట్రైలర్ చూశాక కలిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం సినిమాలో ఉంటుంది`` అని అన్నారు.
వరుణ్ ధావన్ మాట్లాడుతూ ``బవాల్ నా కెరీర్‌లో స్పెషల్ సినిమా. నేనిప్పటిదాకా ఏ సినిమా చేయడానికీ ఇంత కష్టపడలేదు. ఎమోషన్స్ బావుంటాయి. చాలా అందమైన అల్లికతో కథ సాగుతుంది. ప్రతి కేరక్టర్ మనసుకు హత్తుకుంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తమతో కొన్ని అనుభవాలను తీసుకెళ్తారు`` అని అన్నారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ ``చాలా బ్రిలియంట్‌గా తెరకెక్కించారు. ఇద్దరి మధ్య వైరుధ్యాలను, ఇష్టా యిష్టాలను అందంగా తెరకెక్కించారు. ప్రేమ నుంచి గందరగోళానికి సాగే ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారు`` అని అన్నారు. జులై 21న డిజిటల్ రిలీజ్ కానుంది బవాల్ సినిమా.