English | Telugu

ఆ ఇద్దరి గురించి క్లారిటీ ఇచ్చిన శివాజీ!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సీజన్ విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. శివాజీ ఫెయిర్ గేమ్ తో,‌ అతని సపోర్ట్ తో పల్లవి ప్రశాంత్, యావర్ ఇద్దరు టాప్-5 లో ఉన్నారు. హౌస్ నుండి బయటకొచ్చాక చాలా ఇష్యూలు జరిగాయి. ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన దానికి ప్రశాంత్ ని పోలీసులు జైలుకి తీసుకెళ్ళారు‌. ఆ తర్వాత భోలే షావలి పట్టుదలతో, శ్రమతో‌ లాయర్లతో మాట్లాడి బెయొల్ మీద ప్రశాంత్ ని బయటకు తీసుకొచ్చాడు.

ఆ తర్వాత భోలే షావలి ఇంట్లో‌ విందు ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పుడు తాజాగా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రశాంత్, ఆట సందీప్, శుభశ్రీ రాయగురు, టేస్టీ తేజ, శివాజీ అందరు ఒక చోట కలిసారు. ఇక వాళ్ళమతా కలిసి మాట్లాడుకున్నారు ఇదంతా వ్లాగ్ గా చేసి శివాజీ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాడు‌.

మాకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. సందీప్ , ప్రశాంత్ ఇద్దరు గొడవపడలేదు. కొట్లాడుకోలేదు. వాడిని వీడు అవమానించింది లేదు. వీడిని వాడు అవమానించింది లేదు. ఏదైన అవమానాల దాకా వస్తే సర్దడానికి ఈ శివన్న ఉన్నాడు. ఆ ఇష్యూ ఏం లేదు. మేం అందరం ఒక్కటే. సో అటువంటి మాతో పాటే ఉన్న సందీప్ ని ఎలా బయటకు పంపించాడో వాడు టేస్టీ తేజ.. వాడిని కూడా దేవుడు అదేవిధంగా పంపించాడని శివాజీ అన్నాడు. ఓయ్ ఇదేందయ్యా ఇది అని టేస్టీ తేజ అనగా.. అని అందరు అనుకుంటున్నారని శివాజీ కవర్ చేశాడు. ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్. మొన్న బయటకొచ్చాక నాతో ఫుడ్ వీడియో తీసాడు. ఆ వీడియోకి వాడెంత ఎంత తీసుకున్నాడని వాడి ఇష్టమని, తేజ అనేవాడిని మీరు ఆదరిస్తారని అలాగే త్వరలో మొదలయ్యే ఓటీటీ బిగ్ బాస్ కి వాడిని తీసుకెళ్తారని, వాడు కప్ కొట్టాలని బయట ఉండి నేను, ప్రశాంత్, సందీప్ వాడికి సపోర్ట్ చేస్తామని శివాజీ అన్నాడు. ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు గాని ఇప్పుడు సపోర్ట్ చేస్తారంట అని తేజ నవ్వుతూ అన్నాడు.

తేజతో పాటు మన సుబ్బు కూడా ఉంది. హౌస్ లో తనతో ఏం మాట్లాడానో మీరందరు‌ చూసారు. నా హార్ట్ కి నచ్చిన నా తోబుట్టువు లాంటి మనిషి సుబ్బు. చాలా చాలా వచ్చిందని శివాజీ అన్నాడు. అలా శివాజీ చెప్తున్నప్పుడు తేజ ఓ లుక్కేశాడు. అది చూసి వీడి లుక్కేంటంటే.. అంటే నీ ఏజ్ తగ్గించుకుంటున్నావా అని ఫీలింగ్ అని శివాజీ అనగా.. లేదు లేదు నేను బావ అని పిలుస్తానని తేజ అన్నాడు. నేను బావ కాదురా నువ్వే నాకు బాబాయ్ లా ఉన్నావని శివాజీ అన్నాడు. ఏం పర్లేదులే అని తేజ అనగా.. వీడు మాటలే లోపల ఏం లేదు. అంటే ఆ ఉద్దేశం కాదు. పెళ్ళి ఎందుకు అవ్వలేదని మీరంతా అనొద్దని శివాజీ అనగా.. వయసు ఇంకా అంత రాలేదని తేజ అన్నాడు. ఇంకా వయసు రాలేదనుకుంటాడు కానీ అది వెళ్ళిపోతుంది. మేమంతా ఇలాగే సరదాగా ఉంటాం. మా మీద ఎలాంటి అపోహలు వద్దు. మేమంతా ఇలాగే సరదాగా ఉంటాం. అందరు బాగుండాలి అందులో మేమ్ ఉండాలి. బ్రతుకు బ్రతికించు జై శివన్న అని శివాజీ అన్నాడు. అది విని జై శివన్న అని అంటూ ప్రశాంత్, సందీప్, శుభశ్రీ రాయగురు నవ్వేశారు.‌ ఇదేందయ్యా ఇది లాస్ట్ కి జై జవాన్ జై కిసాన్ అన్నట్టు జై శివన్న అని అన్నాడని ఆట సందీప్ అన్నాడు.‌ " పెద్దాయన చెప్పాడు నాతో‌ ఒక ఫుడ్ వ్లాగ్ చేయమని అన్నాడు. అలాగే సందీప్ మాస్టర్ అయితే కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు.‌ సుబ్బు ‌పాపతో‌ కూడా త్వరలో‌ ఓ వీడియో తీస్తాను. పల్లవి ప్రశాంత్ ఓ‌ వ్లాగ్ చేస్తాను" అని తేజ అన్నాడు. అలా‌ వీరంతా డిసెంబర్ 31st సరదాగా‌‌ కలుసుకొని ఎంజాయ్ చేశారు.