English | Telugu

అధికార పార్టీకి శివాజీ వార్నింగ్.. డిస్కషన్ మధ్యలో పీకే టాపిక్!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన శివాజీ హౌస్ లో ఉండగా చాణుక్యుడి అని పేరు తెచ్చుకున్నారు. అలాంటి శివాజీ హౌస్ నుంచి బయటకు వచ్చాక రకరకాల ఇంటర్వ్యూస్ తో బిజీ ఇపోయారు. అలాగే టేస్టీ తేజతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. "నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయను. రాజకీయ పార్టీల తరుపున పోటీ చేయను. ప్రజలకు శివాజీ అవసరం వచ్చినప్పుడు నాకున్న పరిస్థితులను కూడా పక్కన పెట్టి మరీ ప్రజల కోసం అడ్డంగా నిలబడతాను. ఎందుకంటే మనకంటే రాబోయే తరాలు చాలా ముఖ్యం. ఇప్పటికిప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల జోలికి పోను. ప్రజల గొంతుకగా ఉంటాను. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అధికార పార్టీ నా గురించి నెగిటివ్ చేయడానికి చాలా ట్రై చేశారు కానీ.. జనం ఒప్పుకోలేదు. నాకు రాజకీయాల మీద పెద్దగా ఇంట్రస్ట్ లేదు. కానీ నన్ను కెలికితే మాత్రం వెళ్తాను. నన్ను కెలకెద్దు.. నా జోలికి రావొద్దు. నా పని ప్రజలతోనే కానీ.. రాజకీయ పార్టీలతో కాదు. నన్ను కెలకొద్దని మళ్లీ మళ్లీ చెప్తున్నా." అంటూ అధికార పార్టీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. " ప్రస్తుతం సినిమాలు చేద్దాం అనుకుంటున్నా...రోజుకో స్క్రిప్ట్ వింటున్న. సినిమాలు తప్ప మనకేం వచ్చు..లేదంటే అక్కడో సైట్ ఇక్కడో సైట్ కొని అమ్ముకోవడం నాలుగు డబ్బులొస్తే పక్కనేసుకోవడమే..నాకు భూమే అన్నం పెట్టింది. అమర్ దీప్ గురించి చెప్పాలంటే, అతని దగ్గర కెపాసిటీ ఉంది కానీ చేజేతులారా పాడుచేసుకున్నాడని అనుకున్నా...యావర్ గురించి చెప్పాలంటే ఒక మంచి ఆర్టిస్ట్ మెటీరియల్ మంచి నటుడు అవుతాడని నాకు మంచి నమ్మకం ఉంది. స్పై బ్యాచ్ నుంచి ఒక గంట నిడివి ఉండే ఒక షార్ట్ ఫిలిం తీసుకొస్తున్నాను. శివ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్రెడీ దానికి రంగం సిద్ధం చేస్తున్నారు. మార్చ్ ఎండింగ్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తాను. నా తాజా వెబ్ సిరీస్ 90's ని కూడా మీరంతా చూసి ఆదరించండి. ఇక టేస్టీ తేజ గురించి చెప్పాలంటే స్ట్రాటజీస్ బాగా వేస్తాడు.. ఎలా అంటే ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా అతనిలాగా" అంటూ ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చాడు శివాజీ.