English | Telugu
రష్మీ తెలుగు వింటే ఆ ఆలోచనే రాదు.. ప్రణీతకు ఆది సలహా
Updated : Jan 1, 2024
ఢీ సెలబ్రిటీ స్పెషల్ నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది, రష్మీ తెలుగు గురించి చెప్పడం ఫన్నీగా ఉంది. ఐతే ఈ షోకి బబుల్ గమ్ మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. హీరో రోషన్ కనకాల, హీరోయిన్ మానస వచ్చారు. వాళ్ళతో పాటు హోస్ట్ సుమ కూడా వచ్చారు. ఇక ఢీ షో జడ్జి ప్రణీతను సుమ ఒక ప్రశ్న అడిగారు "మీ న్యూ ఇయర్ రెసొల్యూషన్ ఏమిటి" అని దానికి ఆమె "మంచిగా తెలుగులో జడ్జిమెంట్ చేయాలని ఉంది" అని ఎంతో ఎక్సైటింగ్ గా చెప్పింది ప్రణీత. దానికి ఆది మధ్యలో వచ్చి "మా దగ్గర రష్మీ అనే యాంకర్ ఉంటుంది. ఆమెను చూడండి మీరు అసలు ఈ థాట్ రానే రాదు మీకు" అని ఉచిత సలహా పారేసి రష్మీని అవమానించాడు ఆది.
ఇక ప్రోమో ఎండింగ్ లో కుమార్ మాష్టర్ వచ్చి "టేక్ ఏ బౌ" అంటూ సుమ ముందు తన తల మీద వున్న విగ్గును తీసి చూపించేసరికి షాకైపోయింది సుమ. ఇక ఆది పంచులు వేసేశాడు "మీరు చేసేది సుమ అడ్డా...కానీ అది కుమార్ అడ్డా" అన్నాడు. ఇక ప్రోమో స్టార్టింగ్ లో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ రేంజ్ లో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు..ఇక షోకి వచ్చిన రోషన్ కనకాలని ఆది ఆడేసుకున్నాడు "నువ్వు సుమ గారి అబ్బాయివని తెలిసింది...కానీ మన దగ్గర రికమండేషన్లు పని చేయవు..చాల సీరియస్ గా ఉంటుంది" అన్నాడు ఆది. "లేదు మాష్టర్ నేను చేస్తా..." అన్నాడు రోషన్.."ఏంటమ్మా నువ్వెంటి అంత దూరంగా ఉన్నావ్..ఫ్రీ గా ఉండరా. ఏముంది అందులో" అంటూ హీరోయిన్ మానస్ భుజం మీద చెయ్యేసి హడావిడి చేసాడు ఆది.
ఇక ఈ వారం షోలో జడ్జి శేఖర్ మాష్టర్ కనిపించలేదు. ఆయన ప్లేస్ లో 2021 కలైమామణి అవార్డు విన్నర్ తమిళ్ కొరియోగ్రాఫర్ శ్రీధర్ మాష్టర్ వచ్చారు. ఇక నెటిజన్స్ మాత్రం శేఖర్ మాష్టర్ ఏమైపోయారు..ప్రదీప్ అన్న కావాలి అని అడుగుతున్నారు.