English | Telugu

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా న్యూ ఇయర్ గిఫ్ట్ అదేనా?

న్యూ ఇయర్ ని ఒక్కొక్కరు ఒక్కో లెవెల్ లో ఎంజాయ్ చేస్తుంటారు.‌ కొందరు తమకిష్టమైన ప్రదేశాలకి వెళ్తుంటారు. మరికొందరు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతారు. కానీ బిగ్ బాస్ బ్యూటీ ఇనయా మాత్రం నెటిజన్లకి తన అందచందాలతో ట్రీట్ ఇచ్చింది. ఇనయా థైస్, చెస్ట్ చూపిస్తూ నెటిజన్లకి అందాలవిందు ఇచ్చింది.

అసలు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని వారు కూడా బిగ్ బాస్ షో ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. సీజన్ సిక్స్ లో ఇనయా ముజిబుర్ రహమాన్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. సినిమాల మీద మక్కువతో ఎన్నో రోజులు సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని చెప్పి‌న ఇనయా‌‌.. మూడు సినిమాలలో నటించిందని చెప్పింది. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించనంత క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తన పర్ఫామెన్స్ తో తనకంటు ఫ్యాన్ బేస్ పెంచుకుంది. బిగ్ బాస్ షో తర్వాత కుకింగ్ వీడియోలని, ట్రావెలింగ్ అంటు జర్నీ వీడియోలని పోస్ట్ చేసింది ఇనయా. ఊటీలో హాట్ ఫోటోషూట్స్ తో అందరిచేత విమర్శించుకుంది ఇనయా. ఇనయా సుల్తానా యూట్యూబ్ లో తనకంటూ ఓ ఛానెల్ ని క్రియేట్ చేసి వ్లాగ్స్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అయితే ఎప్పుడు ఏదో ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసి ట్రెండింగ్ లో ఉండే ఈ భామ.‌. న్యూ ఇయర్ కి తెల్ల చొక్కా వేసుకొని పైన రెండు బటన్ లని పెట్టుకోకుండా అలానే వదిలేసింది. పైన, కింద చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ. అయితే ఈ ఫోటోలని చూసిన నెటిజన్లు పాజిటివ్ కంటే నెగెటివ్ గానే ఎక్కువ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.