English | Telugu
బాబు మూవీ ప్రమోషన్స్ లో టేస్టీ తేజ డబుల్ మీనింగ్ డైలాగ్స్!
Updated : Mar 7, 2024
బిగ్ బాస్ ఎంతోమంది కొత్త నటీనటులని తెలుగు టీవీ ప్రేక్షకులకి పరిచయం చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కళ్యాణ్ తాజాగా 'బాబు' అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీతు చౌదరి హోస్ట్ గా చేస్తున్న 'దావత్' షోకి వచ్చి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయగా అవి వైరల్ అయ్యాయి. ఇప్పుడేమో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో అర్జున్ కళ్యాణ్, హీరోయిన్ కుషిత రీసెంట్ గా టేస్టీ తేజతో కలిసి ఓ ఫుడ్ వ్లాగ్ చేశారు.
కుషిత, అర్జున్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్...తనతో ఐతే కంఫర్ట్ గా నటించవచ్చు అని తెలిసి రిఫర్ చేసిందట. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా హౌస్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అర్జున్ కళ్యాణ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌ను వాడుకుంటూ బుల్లితెరపై, వెండితెరపై, సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోన్నాడు అర్జున్ కళ్యాణ్. ప్రస్తుతం అర్జున్ కళ్యాణ్ కొత్త సినిమా " బాబు.. బుల్ షిట్ గై" అంటూ అర్జున్ కళ్యాణ్ అందర్నీ పలకరించబోతోన్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల కానుంది. మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో టేస్టీ తేజ అందరికి సుపరిచితయ్యాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు సీరియల్ బ్యాచ్ లోని శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్ లతో ఎక్కువగా ఉన్నాడు. బిగ్ బాస్ ముందు వరకు ఫుడ్ వ్లాగ్స్ తో ఫేమస్ అయ్యాడు. అంతకముందు జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్ లలో కామెడీ కూడా పండించాడు. అయితే బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ బాగానే చేస్తున్నాడు. ఇక అర్జున్ కళ్యాణ్, కుషితతో కలిసి " డిన్నర్ విత్ కుషిత కల్లాపు అండ్ అర్జున్ కళ్యాణ్ " అనే వ్లాగ్ చేశాడు టేస్టీ తేజ. ఇందులో అన్నీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు తేజ. ఫిష్ ఎగ్స్ తో బేరర్ ఓ కబాబ్ ని తీసుకొని రాగా.. ఇవి ఎక్కడి నుండి వస్తాయో తెలుసా అని హీరోయిన్ కుషితని తేజ అడుగగా.. తెలుసని తను అంది. ఎలా తెలుసని మళ్ళీ తేజ అడిగాడు. చాలా సినిమాలలో చూసానని కుషిత అనగా.. సరే ఏ సినిమాలో చూసావో చెప్పని తేజ అన్నాడు. అంత గుచ్చి గుచ్చి అడగాలా ఏంటని కుషిత అంది. ఇక చీజ్ అంటే ఇష్టమని కుషిత అనగా.. వెక్కిలిగా నవ్వుతూ ఏదో ఏదో మాట్లాడి మళ్ళీ కవర్ చేస్తున్నాడు తేజ. ఇక ఈ వ్లాగ్ ని చూసిన నెటిజన్లు.. ప్రమోషన్స్ వర్సెస్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటు కామెంట్లు చేస్తున్నారు.