English | Telugu

Brahmamudi : భార్య కోసం ఓ మెట్టు దిగి‌న భర్త.. అనామిక మాటలకి రాజ్ ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -350 లో.. రాజ్ కి శ్వేత ఫోన్ చేస్తుంది. ఇక అత్తారింట్లో ఉన్న రాజ్ అండమాన్ జైల్లో ఉన్నట్లుందని శ్వేతకి చెప్తాడు. నవ్వుతూనే నరకం చూపిస్తున్నారని చెప్తాడు. ఇంక సరిపోదంటు రాజ్ ఓవర్ యాక్షన్ చేస్తు.. అల్లుడు గారు మర్యాదలని చెప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారంటు బిల్డప్ ఇస్తాడు. నీకు కావ్యపై ప్రేమ ఉంది. ఎక్కడ కావ్య నీకు దూరం అవుతుందోనని టెన్షన్ పడుతున్నావని శ్వేత అనగానే.. అసలు ఛాన్స్ లేదని రాజ్ అంటాడు.

ఆ తర్వాత ఉన్నపల్లంగా కావ్య బావ ఎందుకు వచ్చాడు. మీరు విడిపోతున్నారని తెలిసే వచ్చాడా.. గతంలో కావ్యని ప్రేమించిన భాస్కర్ ఇప్పుడు వచ్చాడంటే నువ్వు ఖచ్చితంగా ఎందుకు వచ్చాడో కనుక్కోవాలి.. కావ్య నీకు దూరం కాకుండా ఉండాలంటే నువ్వు తెలుసుకో అని రాజ్ కి శ్వేత సలహా ఇస్తుంది. మరొకవైపు ఇంకా ఏం చేస్తే కావ్యపై ప్రేమని‌ రాజ్ బయటపెడతాడోనని కృష్ణమూర్తి, కావ్య, అప్పులతో భాస్కర్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఇంటికి వస్తాడు. ఏమైందని ప్రకాష్ అడుగుతాడు. ఈ రోజు అన్ని రిజెక్ట్ అని చెప్తాడు.. ఆ తర్వాత అనామిక వచ్చి కళ్యాణ్ ని చులకన చేసి మాట్లాడుతుంది. మరోవైపు కావ్య వాళ్ళ దగ్గరికి రాజ్ వస్తాడు. వాళ్ళ చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి కావ్య , భాస్కర్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే రాజ్ చూడలేకపోతాడు. మీరు డాన్స్ చేస్తే చూడాలని ఉందని కావ్య, భాస్కర్ లని అప్పు అడుగుతుంది. ఒసేయ్ పొట్టి జుట్టుదాన నీకు ఇలాంటి కొంపలు ముంచే ఆలోచనలు ఎందుకు వస్తాయని రాజ్ తన మనసులో అనుకుంటాడు. అయిన బావ ఏం అనుకోడులే మీరు చెయ్యండని అప్పు అనగానే.. కావ్య, భాస్కర్ లు డాన్స్ చేస్తారు.. ఆ తర్వాత కావ్య అక్కడే ఉన్న నిప్పు తొక్కబోతుంటే రాజ్ చెయ్యి అడ్డుపెడతాడు. అప్పుడు రాజ్ కి చెయ్యి కాలుతుంది. అది చూసిన కావ్య బాధపడుతు.. ఏమైంది అంటు అడుగుతుంది. కావ్యకి ఏం కాకూడదని రాజ్ అలా చేసాడు.. రాజ్ లో మార్పు వస్తుందని భాస్కర్ అంటాడు.

ఆ తర్వాత స్వప్న డబ్బులు కావాలని రుద్రాణిని అడుగుతుంది. నేను ఇవ్వనని రుద్రాణి చెప్తుంది. మరొకవైపు భాస్కర్ కావాలనే నడవరావట్లేదని యాక్టింగ్ చేస్తాడు. నేను హెల్ప్ చేస్తానని కావ్య వెళ్తుంటే నేను ఉన్నాను కదా అని కావ్యను వద్దని రాజ్ వెళ్లి భాస్కర్ కి హెల్ప్ చేస్తాడు. తరువాయి భాగంలో స్వప్న మోడల్ గా డబ్బుల కోసం ఇంటి ముందు ఫోటో షూట్ చేస్తుంటే.. అందరు షాక్ అవుతారు.. నాకు డబ్బులు కావాలంటే మా పుట్టింటి నుండి తెచ్చుకోవాలని మా అత్తయ్య అంటున్నారని స్వప్న అంటుంది. మీకేం ఉంది.. అప్పుని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నారు.. అందుకేగా అని అనామిక అనగానే తనపై రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.