English | Telugu

బ్రహ్మముడి శ్రీకర్ కృష్ణ పెళ్ళికొడుకు అయ్యాడు!

స్టార్ మా సీరియల్స్ లలో 'బ్రహ్మముడి' సీరియల్ కి ఉండే క్రేజే వేరు. ఇందులో కావ్య-రాజ్ ల జోడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారిద్దరి తర్వాత రాహుల్-స్వప్నల జోడీ ఫేమస్ అయింది. వారిద్దరి మైండ్ సెట్ దాదాపు ఓకేలా ఉండటమే దీనికి కారణం.

బ్రహ్మముడి సీరియల్ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ సీరియల్ కనకం-కృష్ణమూర్తిల కుటుంబానికి దుగ్గిరాల కుటుంబానికి మధ్య సాగే సన్నివేశాలన్నీ అందరికి బాగా కనెక్ట్ అయ్యాయి. నీపా అలియాస్ కనకం తన పర్ఫామెన్స్ తో అవార్డ్ కూడా సొంతం చేసుకుంది. కావ్య అలియాస్ దీపిక రంగరాజుకి తెలుగులో మొదటి సీరియల్ అయిన తెలుగింటి అమ్మాయిలాగా బాగా చేసింది. హమీద అలియాస్ స్వప్న నెగెటివ్ రోల్ లో చక్కగా ఒదిగిపోయింది. అదే బాటలో రాహుల్ అలియాస్ శ్రీకర్ కృష్ణ కూడా రుద్రాణికి కొడుకుగా ఆకట్టుకుంటున్నాడు. తల్లి బాటలో ఎత్తుకి పై ఎత్తు వేస్తూ బ్రహ్మముడి సీరియల్ ని ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇప్పుడు ఈ సీరియల్ లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీలతో మరింత ఉత్కంఠభరితంగా మారింది.

శ్రీకర్ కృష్ణ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. అలాగే యూట్యూబ్ లో సొంతంగా ఓ ఛానెల్ ని స్టార్ట్ చేశాడు శ్రీకర్ కృష్ణ. ఇందులో బ్రహ్మముడి షూటింగ్ కి సంబంధించిన వ్లాగ్స్, ఇంకా అతని టూర్స్ ట్రావెల్స్ అంటు రకరకాల వ్లాగ్స్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఇప్పుడేమో తను పెళ్ళికొడుకు అయ్యాడు. " నన్ను పెళ్ళికొడుకు చేశారు " అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అది లక్ష వ్యూస్ కి చేరుకుంది. అయితే తను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని ఇంకా రివీల్ చేయకుండా సస్పెన్స్ లో ఉంచాడు శ్రీకర్ కృష్ణ. మరి బ్రహ్మముడి సీరియల్ ని మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు. రాహుల్ స్వప్నల నటన మీకెలా అనిపిస్తోందో కామెంట్ చేయండి. ఇక శ్రీకర్ కృష్ణ తన వైఫ్ ని ఎప్పుడు పరిచయం చేస్తాడో తెలియాలంటే తర్వాతి వ్లాగ్ వరకు ఎదురుచూడాల్సిందే.