English | Telugu

సూపర్ సింగర్ టైటిల్ విన్నర్ ప్రవస్తి...


సూపర్ సింగర్ జరా హట్కె సీజన్ పూర్తయిపోయింది. ఈ గ్రాండ్ ఫినాలే షో మంచి జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ షోకి జడ్జ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ షోలో పవన్ కళ్యాణ్, శ్వేతా, ప్రవస్తి, సుమనస్ టాప్ ఫోర్ లో నిలిచారు. ఈ కాంపిటీషన్ చాలా టఫ్ గా సాగింది. ఐతే లాస్ట్ వీక్ వరకు కూడా పవన్ కళ్యాణ్ టైటిల్ విన్ అవుతాడు అంటూ ఊహాగానాలు జోరుగా సాగాయి. కానీ అనూహ్యంగా టైటిల్ ని ప్రవస్తి గెలుచుకుంది. టాప్ 1 లో అనంత శ్రీరామ్ గ్రూప్ కంటెస్టెంట్ ప్రవస్తి ఈ సీజన్ విన్నర్ గా 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని గెలుచుకుంది.

టాప్ 2 లో మంగ్లీ బ్లాస్టర్స్ నుంచి శ్వేతా నిలిచింది. ఇక ఈమె 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంది. ఇక ప్రవస్తి అందరికి ధన్యవాదాలు చెప్తూ తన కెరీర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందని..ఇక మీదట తాను చేసే ప్రతి పని కాన్సంట్రేషన్ తో చేసే బాధ్యతను ఈ టైటిల్ పెంచిందని చెప్పింది. ఇక శ్వేతా తనకు తన సొంతూరు పాలక్కాడ్ కి వెళ్లాలని లేదని...ఇక్కడే హైదరాబాద్ లో సెటిల్ ఐపోవాలని ఉందని చెప్పింది. ఇక తనకు సపోర్ట్ చేస్తూ శ్రీముఖి కూడా ఇంటరెస్ట్ ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు అంటూ చెప్పింది. ఇక తరువాత ఈ షోలో కంటెస్టెంట్స్ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఇమేజెస్ తో చేసిన లామినేషన్స్ ని అందించారు. ఇలా సూపర్ సింగర్ షో జరా హట్కె సీజన్ పూర్తయ్యింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.