English | Telugu
బిగ్ బాస్ అనేది జస్ట్ షో..అతను కళ్ళ ముందే చనిపోవడం బాధాకరం!
Updated : Mar 16, 2024
"లంబసింగి" మూవీతో దివి మంచి లీడ్ రోల్ ప్లే చేసింది.. బిగ్ బాస్ లో ఆమె తన సత్తా నిరూపించుకుని బయటకు వచ్చింది కానీ అనుకున్నానని ఆఫర్స్ ఐతే ఆమెకు రాలేదు. ఇక లంబసింగి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దివి చాలా విషయాలు చెప్పింది. "బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత మన మీద అభిమానం చాలా ఉంటుంది ఆడియన్స్ కి. కానీ ఆ అభిమానం ఆ షోలో పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు కానీ వేరే కాదు. ఆ అభిమానం కూడా కొద్దీ రోజులే ఉంటుంది.
ఆ తరువాత ఏమిటి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. సోహైల్ ఎపిసోడ్ చూసుకుంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోహైల్ ని అందరూ సపోర్ట్ చేశారు కూడా సినిమా చూడండి అని వేడుకోవడం వేరే విషయం. ఎందుకంటే బిగ్ బాస్ కి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది..జనాలు మనల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది బిగ్ బాస్ వేదిక. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక ఏం చేయాలి అంటే మనమే ఆలోచించుకోవాలి. ప్రతీ బిగ్ బాస్ కి ఆడియన్స్ అభిరుచి మారుతూ ఉంటుంది. ఇక పెళ్లి విషయం గురించి అంటే ఇద్దరం కలిసి బతుకుదాం అనే వాళ్ళే ఎక్కడా కనిపించలేదు. నీకెంత నాకెంత అని అడిగేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నా లవర్ వాళ్ళ బ్రదర్ చావును కళ్లారా చూసాను. అప్పుడే అనుకున్నా ఏదో ఒకటి చేసి చచ్చిపోవాలి ఇలా కాదు అని అప్పుడే అనుకున్నా ఇండస్ట్రీకి రావాలని. కానీ తర్వాత నా లవర్ తో సరిపోలేదు. విడిపోయాం. ఇప్పుడు తనకు పెళ్ళై పోయి మంచి భార్య ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు నాగార్జున గారు, చిరు గారు చాలా సపోర్ట్ చేశారు. ఇక సూర్యకిరణ్ గారు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం.. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా చాలా హ్యాపీగా మాట్లాడేవారు. ఆయన చేసే ఒక మూవీలో నాకు ఛాన్స్ ఇస్తాను అన్నారు. ఆయన మరణం నిజంగా నాకు చాలా బాధకలిగించింది." అంటూ దివి ఎన్నో విషయాలు చెప్పింది.