English | Telugu

మన దేశం మనకు గర్వం వాళ్ళ దేశాలకు అంత సీన్ లేదు...


ఆలీతో సరదాగా సీజన్ 2 లో ఈ వారం బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ ని బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరినాథ్ ని నెక్స్ట్ వీక్ షోకి ఇన్వైట్ చేశారు. ఈ ప్రోమోలో ఇద్దరూ కొన్ని హైలైట్ పాయింట్స్ ని చెప్పారు. "ఆయన క్రికెట్ నేను బాడ్మింటన్ కానీ చాముండేశ్వరి గారు అన్ని స్పోర్ట్స్ కి బాగా క్లోజ్...స్కూల్ లో అటెండెన్స్ తీసుకునేటప్పుడు నా పేరు స్కిప్ చేసేవాళ్ళు..స్కూల్ మొత్తం చప్పట్లు కొడుతూ ఉంటే నేను క్లాస్ బయట మోకాళ్ళ దండ వేసేవాడిని...ఒలింపిక్స్ ఆడి వచ్చి ఒక అమ్మాయికి ఆటోగ్రాఫ్ ఇచ్చి కింద ఐ లవ్ యు అని రాసా నోటితో మాత్రం చెప్పలేదు.

బయట దేశం వాళ్ళతో ఆడి ఓడిపోయాం అంటే వాళ్ళతో ఎందుకు ఓడిపోయాం ..ఎం గెలవలేవా అని అడిగేవాళ్ళు. మన దేశం మనకు గర్వం వాళ్ళ దేశాలకు అంత సీన్ లేదులే...నా లైఫ్ జర్నీ మొత్తంలో 3 కోట్ల అప్పు వచ్చింది. అందరినీ అడగడానికి వెళ్ళేవాడిని అందరూ ముఖం చాటేసి వెళ్లిపోయేవాళ్లు" అని చెప్పాడు పుల్లెల గోపీచంద్. ఇక చాముండేశ్వరినాథ్ కూడా కొన్ని పాయింట్స్ ని చెప్పారు. "ఒకసారి నేను నిలబడి పరీక్ష రాస్తున్నా.. టీచర్స్ నేను మర్యాద ఇస్తూ నిలబడి రాస్తున్నానేమో అనుకుని కూర్చుని రాయమన్నారు. కూర్చుంటే ముందు వాడి ఆన్సర్ షీట్ కనిపించడం లేదు అందుకే నిలబడి రాస్తున్నా అని చెప్పాను. నేను బ్యాంకులో పని చేసేవాడిని అక్కడ మా ఆవిడ నా బాస్. ఆవిడే నాకు ప్రొపోజ్ చేసింది. ఇప్పటి వరకు 24 కార్లు ఇచ్చాను ...సరే ఎవరో ఆలీకి మళ్ళీ పెళ్లి అన్నారు అప్పుడు కార్ ఇద్దామని అనుకుంటున్నా. నాగార్జున ఒకసారి నాగేశ్వరావు గారి దగ్గరకు తీసుకెళ్లి తన ఫ్రెండ్ గా నన్ను పరిచయం చేశారు. ఆయన నన్ను చిరాగ్గా చూసారు." అని చెప్పాడు. ఇక ఈ ఇద్దరి కెరీర్ లో ఎన్నో ఎలిగేషన్స్ ని ఎదుర్కొన్నారు. వాటి గురించి కూడా వీళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ ఇన్సిడెంట్స్ కి సంబంధించి ఆలీ ఏం ప్రశ్నలు అడిగారు వాళ్ళు ఏం చెప్పారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ కోసం కొన్ని డేస్ వెయిట్ చేయాలి.