English | Telugu
కాస్త గ్యాప్ తర్వాత మాస్టర్‌తో కుమ్మేసిన నటకుమారి!
Updated : Jun 3, 2024
కార్తీకదీపం సీరియల్ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అందరికి తెలిసిందే. కొంతకాలం క్రితం మొదలైన ఈ సీరియల్ నవ వసంతంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఇందులో లేడి విలన్లుగా జ్యోత్స్న, పారిజాతం చేస్తుమ్నారు. వీరిద్దరు కలిసి వేసే ఎత్తులకి కార్తిక్, దీపలకి కష్టాలు ప్యాకేజీలా వస్తున్నాయి. అది సీరియల్ చూసే ప్రతీ ఒక్కరికి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇందులో బామ్మ పాత్రలో చేస్తున్న పారిజాతం నెట్టింట వైరల్ గా మారింది.
పారిజాతం అసలు పేరు నటకుమారి. ఈమె డ్యాన్స్ లో దుమ్ముదులుపుతోంది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ట్రెండింగ్ లోని పాటలకి తనదైన స్టెప్పులతో ఆకట్టుకుంటుంది. అబ్బబ్బా.. బామ్మ గారిలో ఏం గ్రేసూ.. ఏం గ్రేసూ.. స్టెప్పు వేసిందంటే స్టేజ్ షేక్ అయిపోవాల్సిందే. ఆమె ఊపు చూస్తుంటే లేచి మనం కూడా డాన్స్ చేయాలనిపించేట్టుగా ఉంది. నటిగా అనేక సీరియల్స్‌లో నటించిన ఈమె దేవత సీరియల్‌లో హీరోయిన్‌గా తల్లిగా నటించింది. తాజాగా కార్తీకదీపం సీరియల్‌లో లేడీ విలన్‌గా విజృంభిస్తోంది. కార్తీకదీపం 2 కథను మలుపుతిప్పే పాత్రలో నటిస్తోంది.
ఇక ఈ సీరియల్‌లో బామ్మ క్యారెక్టర్‌లో నటిస్తున్న నటకుమారి.. రియల్ లైఫ్‌లో మాత్రం ఇంకా యంగే. కార్తీక్‌కి బామ్మగా నటిస్తోంది కానీ.. దాదాపు కార్తీక్‌ది ఈమెది ఒకే వయసు కావడం విశేషం. నటిగానే కాకుండా డాన్స్‌లోనూ మంచి అనుభవం ఉన్న నటకుమారి ఇన్ స్టాగ్రామ్ చూస్తే తనేనా అనిపిస్తుంది. ఈమె డాన్స్ చేస్తున్న వీడియోలకు బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మధ్య డాన్స్ క్లాస్‌లకు కాస్త గ్యాప్ ఇచ్చిన నటకుమారి.. ఇప్పుడు మళ్లీ డాన్స్ అకాడమీకి వెళ్తోంది. అయితే రెట్టించిన ఉత్సాహంతో తన డాన్స్‌తో ఊపేస్తుంది నటకుమారి. కలకత్తా పాన్ వేసినా చూసుకో అంటూ ఓ రేంజ్‌లో ఊపేసింది కార్తీకదీపం బామ్మ. ఇక తాజాగా మహేశ్వరి, రీతూ చౌదరిలతో కలిసి డాన్స్ క్లాస్‌లో రచ్చ రచ్చ చేసింది. చాలా రోజుల తరువాత డాన్స్ క్లాస్‌లకు వెళ్లానంటూ డాన్స్ మాస్టర్‌తో కలసి స్టెప్‌లు వేసింది. ఆమె డ్యాన్స్ అయితే మామూలుగా లేదు. అసలు కార్తీకదీపంలో కనిపించే బామ్మనేనా ఈ నటకుమారి అనేట్టుగా బాడీని షేక్ చేసేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. మీరు చూడకుంటే ఓ లుక్కేయండి.