English | Telugu

Mouni Roy : బీచ్ ఒడ్డున నాగిని బ్యూటీ.. మౌని రాయ్ అందాల ఆరబోత!

బాలీవుడ్ హీరోయిన్లలో గ్లామర్ షోకి పెట్టింది పేరు మౌనీ రాయ్. ఈ బుల్లితెర నాగిని సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల కోసం నెటిజన్లు తెగ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆమె షేర్ చేసే ఫోటోల్లో ఎక్కువ బికినీ పిక్స్‌యే ఉంటాయి.

నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్‌‌ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాలలో హాట్ ఫోటోలతో అదరగొడుతుంది. బ్రహ్మాస్త్ర సినిమాలో లేడీ విలన్‌గా కూడా ఈ బ్యూటీ బాగానే నటించింది. ఇక రీసెంట్‌గా ఇండోనేసియా వెకేషన్‌కి వెళ్లింది మౌనీ. అక్కడ బాలీలోని బీచ్‌లో బికినీలో ఫొటోలకి పోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు మౌని గ్లామర్ షోకి ఫిదా అయిపోతున్నారు.

మౌని రాయ్ కి ఇన్ స్టాగ్రామ్ లో 31.9మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా తను నటించిన ' బ్లాక్ అవుట్ ' ట్రైలర్ కూడా రిలీజైంది. మౌని రాయ్ అటు బాలీవుడ్ లో సినిమాలతో పాటుగా.. ఇటు తెలుగులో నాగిణి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. తాజాగా ఈ భామ ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోన్న ఈ ఫోటోలని ఓసారి మీరు చూసేయ్యండి.



Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.