English | Telugu
హైపర్ ఆదిని వణికించిన రష్మి.. పిల్లాడికి మ్యాజిక్ రాదు!
Updated : Jun 3, 2024
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది, ఇంద్రజ, రష్మీ ముగ్గురూ స్టేజి మీద ఉండగా ఒక పిల్లాడు ఏడుస్తూ వచ్చాడు. "ఏమయిందిరా..అమ్మ తప్పిపోయిందా..వారిలో ఎవరు " అంటూ రష్మీ, ఇంద్రజ వైపు చూపించేసరికి ఇద్దరూ షాకయ్యారు. తర్వాత ఆ పిల్లాడు ఇంద్రజ, రష్మీ దగ్గరకు వెళ్ళాడు.. ఆ పిల్లాడి చేతిలో ఉన్న పేపర్ తీసుకుని చూసేసరికి అందులో ఆది బొమ్మ కనిపించింది. "ఎం కావాలి ఆది నుంచి" అని ఇంద్రజ ఆ పిలాడిని అడిగేసరికి వాడు కాస్తా " నాన్న" అన్నాడు. దానికి ఆది షాక్ అయ్యి కౌంటర్ కామెంట్ చేసాడు "ఏరా నీకు మ్యాజిక్ వచ్చా" అని ఆ పిల్లాడిని అడిగాడు. రాదు అని బాబు చెప్పేసరికి ఐతే కాదులే అంటూ రష్మీ వైపుకు చూసాడు ఆది.. అంటే సుధీర్ రష్మీ పిల్లాడు అన్నట్టుగా ఇన్డైరెక్ట్ గా కౌంటర్ వేసాడు..
సుధీర్ ఎలాగో మ్యాజిక్ చేస్తాడు కాబట్టి అలా ఆ పిల్లాడిని ఆ ప్రశ్న అడిగి రష్మీ వైపు చూసేసరికి రష్మీ షాకయ్యింది. ఇక ఈ షోకి "శశి మధనం" మూవీ టీమ్ వచ్చింది. తర్వాత ఆదితో లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడించింది రష్మీ.. "ఏంటి వణుకుతున్నావ్" అని రోహిణి ఆది మీద కౌంటర్ వేసేసరికి .."ఏజ్ ప్రాబ్లమ్" అంటూ కామెంట్ చేసింది రష్మీ.. ఇక రాకెట్ రాఘవ అందమైన అమ్మాయితో కలిసి సూపర్ గ డాన్స్ చేసాడు. దానికి ఇంద్రజ ఫిదా ఐపోయింది. రాకెట్ రాఘవ కాస్త రొమాంటిక్ రాఘవ అయ్యారు...రొమాన్స్ లో రాకెట్ లా దూసుకుపోతున్నారంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ఇక రాఘవ డాన్స్ కి పవిత్ర కూడా వావ్ అని అనుకుంది. ఇలా నెక్స్ట్ వీక్ షో రాబోతోంది.