బెంజ్ ఈ-ప్లస్ కొనేసిన నటి లహరి
బుల్లితెర సెలబ్రిటీస్ కి కొంచెం పేరు డబ్బు రాగానే ముందుగా వాళ్ళు చేసే పని కారు, ఇల్లు కొనడం. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని వైపులా నుంచి సంపాదన ఉంటుంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. బిజినెస్ లు, యూట్యూబ్ అమౌంట్, షోస్, ఈవెంట్స్, సీరియల్స్, మూవీస్ లో సైడ్ రోల్స్ ఇలా చేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తూ అన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నటి ‘లహరి’ కూడా ఈ కోవలోకి వచ్చేసింది. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.