English | Telugu

Karthika Deepam2 : నాన్న బొమ్మ పట్టుకొని శౌర్య ఎమోషనల్..  కార్తిక్ కి సారీ చెప్పిన దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -81 లో....దీప బాధపడుతుంటే కార్తీక్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. ఇప్పుడు నర్సింహా గురించి చెప్తే పోలీస్ స్టేషన్ అంటాడని దీప సైలెంట్ గా ఉంటుంది. మీ ప్రాబ్లమ్ అయితే చెప్పకండి కానీ శౌర్యకి ఏదైనా ప్రాబ్లమ్ అయితే మాత్రం కచ్చితంగా చెప్పండి. మీరు తనకి తల్లి నేను తనకి ఫ్రెండ్ ని.. తన బాధ్యత మీరు నాకు ఇవ్వలేదు.. నేనే తీసుకున్నానని కార్తీక్ చెప్పి వెళ్లిపోతుంటే.. ఆగండి బాబు అని దీప పిలుస్తంది. నన్ను అర్థం చేసుకొని మీ ప్రాబ్లమ్ చెప్తున్నందుకు థాంక్స్ అని కార్తీక్ అంటాడు. నేను నా ప్రాబ్లమ్ చెప్పడానికి పిలువలేదని దీప అంటుంది.

మిమ్మల్ని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నాను.. సారీ చెప్పడానికి పిలిచాను. మా నాన్న చావుకి కారణం మీరే అని ఇన్నిరోజులు బాధపెట్టాను.. మీరు కాదని తెలిసి మిమ్మల్ని అవమానించినదుకు నన్ను క్షమించండి అని దీప అనగానే.. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకు చాలా రిలీఫ్ గా ఉందని కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు రేపు మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాలి ఒక గంట స్పెండ్ చేయగలరా అని శ్రీధర్ ని కావేరి అడుగుతుంది. ఇప్పుడే స్వప్నకి పెళ్లి ఎందుకు చదువుకుంటుంది.. జాబ్ చెయ్యాలి అనుకుంటుంది కదా అని శ్రీధర్ అంటాడు. ఎక్కడ నా గురించి తెలిసిపోతుందో అని కావేరి టెన్షన్ పడుతున్నట్లందని శ్రీధర్ అనుకుంటాడు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను.. నువ్వు ఎప్పుడు క్యాంపులు అంటూ తిరుగాతావ్.. మమ్మీ ఇంట్లో ఒక్కతే ఉంటుందా అని స్వప్న అంటుంది. నేను ఎప్పుడు మీ మమ్మీతోనే ఉంటానని శ్రీధర్ అంటాడు. అప్పుడే కాంచన ఫోన్ చేస్తుంది. టెన్షన్ గా లిఫ్ట్ చేసి ఆఫీస్ లో ఉన్నానంటూ కట్ చేస్తాడు. ఆ తర్వాత శ్రీధర్ వెళ్ళిపోయాక ఆ రోజు డాడ్ తో చూసిన ఆవిడని కనుక్కోవాలని స్వప్న అనుకుంటుంది.

మరోవైపు శౌర్య కోసం చూస్తుంటే తను కన్పించకపోయేసరికి.. దీప టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత దీపని శౌర్య ఆటపట్టిస్తుంది. ఇద్దరు సరదాగా నువ్వుకుంటారు. మరొకవైపు జ్యోత్స్న, కార్తీక్ ల పెళ్లి విషయం కాంచనతో మాట్లాడగా.. కార్తీక్ తో మాట్లాడుతానందని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ ఇష్టమని సుమిత్ర అంటుంది. పరిస్థితి మన చేతిలో ఉన్నప్పుడు త్వరగా పెళ్లి చేయాలంటూ దీప గురించి తప్పుగా పారిజాతం మాట్లాడుతుంటే.. శివన్నారాయణ కోప్పడతాడు. మరోవైపు అమ్మ నేనొక సర్ప్రైజ్ అంటూ శౌర్య అంటుంది. పేపర్స్ తో బొమ్మలు చేసి ఒకటి నువ్వు.. ఒకటి నేను.. ఒకటి నాన్న అని నాన్న బొమ్మ పట్టుకొని ఎమోషనల్ అవుతుంది శౌర్య. నీ తండ్రి గురించి తెలిస్తే నువ్వు తట్టుకోలేవని దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.