English | Telugu

Brahmamudi : అన్నకి శోభనం.. తన భార్యకి విడాకులిస్తానన్న తమ్ముడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -447 లో.....రాజ్, కావ్యలు వాళ్ళ రూమ్ కి వెళ్లేసరికి ఇందిరాదేవి, సీతారామయ్య వాళ్ళుంటారు. మీరేంటి మా గదిలో ఉన్నారని రాజ్ అడుగుతాడు. ఈ రోజు మేమ్ ఇక్కడే పడుకుంటాం.. మీరు మా గదిలో పడుకోండి అని ఇందిరాదేవి అంటుంది. ఈ రోజేంటి ఇంట్లో అందరు వింతగా ప్రవర్తిస్తున్నారని రాజ్, కావ్య ఇద్దరు అనుకుంటారు. ప్లాన్ సక్సెస్ అయిందంటూ ఇందిరాదేవి, అపర్ణ, స్వప్న, ప్రకాష్ సుభాష్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను వెలిగించిన అగ్గిపుల్ల ఇంక చిచ్చు పెట్టలేదు ఏంటని రుద్రాణి అనుకుంటుంది.

ఆ తర్వాత కావ్య, రాజ్ లు గదిలోకి వస్తారు. రూమ్ లో లైట్ వెయ్యగానే గది డెకరేషన్ చేసి ఉండడంతో ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. ప్రొద్దున నుండి వీళ్ళు ఈ గదిలోకి అందుకే రానివ్వలేదా అని రాజ్ కావ్యలు అనుకుంటారు. ఇదంతా నీ ప్లానే నా అని కావ్యతో రాజ్ అనగా.. నాకు శోభనం జరిపించండి అని సిగ్గు లేకుండా నేనెలా చెప్తానని కావ్య అంటుంది. కాసేపటికి ఇదంతా మీ ప్లానేనా అని రాజ్ ని కావ్య అడుగుతుంది. నీకో విషయం చెప్పాలని కావ్యని రాజ్ దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడే బయట నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఏంటని అందరు హాల్లోకి వస్తారు. కళ్యాణ్ కోపంగా అనామిక అంటూ పిలుస్తాడు. అనామిక రాగానే పేపర్స్ తన మొహంపై విసిరేస్తాడు. ఏంటి అవి అని రాజ్ అడుగుతాడు. విడాకుల పత్రాలు అని కళ్యాణ్ అనగానే.. అందరు షాక్ అవుతారు. నా భార్య అనే దరిద్రాన్ని వదిలించుకోవడానికి కోర్ట్ ని విడాకులు అడుగుతున్నా అని కళ్యాణ్ అనగానే.. నువ్వు తప్పు చేసి.. హోటల్ లో అప్పు, నువ్వు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయి.. నాకు విడాకులు ఇచ్చి.. ఆ తర్వాత ఈ అడ్డు లేకుండా అప్పుతో ఉందామనుకుంటున్నావా అని అనామిక అనగానే.. తనపై చెయ్ ఎత్తుతాడు కళ్యాణ్.

ఆ తప్పు నేను చేశానా అదంతా నువ్వు క్రియేట్ చేసావని కళ్యాణ్ అంటాడు. అప్పుని నన్ను చెడుగా చూపించడానికి తనే ఇదంతా ప్లాన్ చేసింది. దానికి నా దగ్గర సాక్ష్యం ఉందని కళ్యాణ్ అంటాడు. హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తాడు. అందులో అప్పు, కళ్యాణ్ లు లోపలికి వెళ్ళగానే.. ఎవరో డోర్ వేసి, మీడియా రాగానే డోర్ తీసినట్టు ఉంటుంది. ఆ డోర్ వేసిన అతనిని కళ్యాణ్ పిలిస్తాడు. అతను అనామికనే అలా చేయమని చెప్పిందని చెప్తాడు. అదంతా అబద్దమని అనామిక అంటుంది. అతని ఫోన్ తీసుకొని మరి నువ్వు ఇతనికి డబ్బులు ఎందుకు పంపావని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కళ్యాణ్ అతన్ని పంపించి ఇప్పటికైనా నిజం ఒప్పుకోమని అనగానే.. అవును అదంతా నేనే చేసానంటూ చెప్తుంది అనామిక. దాంతో అనామిక చెంపచెల్లుమనిపిస్తుంది ధాన్యలక్ష్మి. నువ్వు పదిలక్షలు మీ ఇంటికి చేరవేస్తున్నా.. నేనేం అనలేదు అంటు అనామికని ధాన్యలక్ష్మి తిడుతుంది. తరువాయి భాగంలో అనామిక అప్పు గురించి తప్పుగా మాట్లాడుతుంటే కళ్యాణ్ తనపై చెయ్ ఎత్తుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.