English | Telugu
చిత్తూరు జిల్లా నగరి నుంచి ఎన్నికల బరిలో దిగిన వైఎస్ఆర్
బుట్ట బొమ్మలా ముద్దుగొలిపే అమలా పాల్ తెలుగులో కుర్ర హీరోలందరి పక్కన నటించేసింది. అంతటితో చాలు అనుకుందో ఏమిటో పెళ్లికి సయ్యంటోంది. సౌత్ డైరెక్టర్ విజయ్, అమలా పాల్ ను వివాహం చేసుకుంటున్నట్లు ముందే ప్రకటించారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తరువాత అంజలిగా కన్నా సీతగానే ఎక్కువ మందికి గుర్తుస్తోంది ఈ తెలుగింటమ్మాయి. చూడటానికి మహా అమాయకంగా ఉండే అంజలి చంద్రముఖిలా మారితే ఎలా ఉంటుంది, ఏమో అదే చూడబోతున్నామేమో గీతాంజలి చిత్రంలో.
చిన్న వయసులోనే ఎనర్జిటిక్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ తన మొదటి సినిమా దేవదాస్ నుంచి మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. యంగ్ స్టార్ పుట్టిన రోజు మే 15.
మగధీరాలో అందాల యువరాణిగా తెలుగు ఆడియెన్స్ మనసులో నిండి పోయిన కాజల్ ఇప్పుడు ట్విట్టర్ లో కూడా సౌత్ క్వీన్ అయిపోయింది.
జయం సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో నితిన్ తన కెరీర్ లో ఎన్నో పరాజయాలు చూశాడు. ఒకటి కాదు, రెండు కాదు వరసగా పధ్నాలుగు ఫ్లాపులు వచ్చినా తట్టుకొని
కథా, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం సింగిల్ కార్డులో ఇముడ్చుకుని సినిమాని సింగిల్ హాండెడ్ గా హ్యాండిల్ చేసే డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూటు మార్చినట్లు కనిపిస్తోంది.
సన్నీ లియోన్.. కుర్రకారుకి ఆమె పేరు వినపడితే గిలిగింతలే. ఓర చూపుతో స్క్రీన్ ను శాసిస్తున్న ఈ స్పైసీ బేబి పుట్టిన రోజు ఈ రోజు.పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హాట్ భామ జీవితం తెరిచిన పుస్తకం. పంజాబీ సిక్ కుటుంబానికి చెందిన సన్నీ అసలు పేరు కెరంజీత్ కౌర్. చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో హాకీ, స్కేటింగ్ ఆడుతూ పెరిగిన సన్నీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా బాహాటంగానే చెప్పుకుంటుంది.
రవ్వలడ్డు లాంటి ఈ అమ్మాయి తెలుగు వారికి ఒకప్పుడు బాగానే నచ్చింది. వరుసగా సినిమా అవకాశాలు వచ్చి పడ్డాయి. పెద్ద హీరోలతో పాటు కుర్ర హీరోల పక్కన కూడా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు అడపాదడపా ఐటం సాంగ్ లలో మాత్రమే కనిపిస్తోంది.
సాదా సీదాగా సినిమా తీసినా పబ్లిసిటీ మాత్రం తెలివిగా చేసుకోవాలి. దీనికి ఎవరి సినిమాలు మినహాయింపు కావు. అందుకే హీరో నాగార్జున ‘మనం’సినిమా పబ్లిసిటి చాల వెరైటీగా చేస్తున్నాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు హారీస్ జయరాజ్ని కిడ్నాప్ చేసేందుకు జరిగిన ప్రయత్నం విఫలమయ్యింది. ఈ వార్తా ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ వార్త వెలుగులోకి రావడంతో జయరాజ్ అభిమానులు కంగారుపడ్డారు. అయితే కిడ్నాప్ కు ప్రయత్నించిన వారి అరెస్టుతో అంతా సర్దుకుంది.
అందం ఉండగానే కెరీర్ చక్క పెట్టుకోవాలి అనే విషయం ఇప్పటి హీరోయిన్లకు బాగా తెలుసు అనిపిస్తోంది. అందానికి లౌక్యం జోడించి చక్కగా కెరీర్ ని మూడు సినిమాలు ఆరు అడ్వటైజ్ మెంట్లు చేసుకుంటున్నారు.
అది ఆరడుగుల బుల్లెట్టు... విడుదల అయిన నాటి నుంచి ఈ సాంగ్ సూపర్ హిట్. దీంతో ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల ద్రుష్టి ఈ బుల్లెట్ టైటిల్ పైన పడింది.
కలెక్షన్ లు కురిపించడం లో రేస్ గుర్రంలా దూసుకెళ్ళే బన్నీ సినిమాలు ఎంచుకోవడంలో ఎప్పుడు మిస్టర్ పర్ఫెక్టే. రీసెంట్ గా రేస్ గుర్రం సినిమాతో మంచి హిట్ సాధించిన ఈ హీరో ఒక కొత్త సినిమాకు ఓకే చెప్పేశాడు.
పెళ్ళైన తర్వాత ఎటువంటి వివాదాస్పద వార్తలకు చోటివ్వని ఐశ్వర్యా రాయ్, తల్లి అయిన తర్వాత సినిమాలకు కూడా దూరమయి మాతృమూర్తిగా తన పూర్తి సమయం ఇంటికే కేటాయిస్తోంది.అడపా దడపా కొన్ని ప్రకటనల్లో తప్ప మరెక్కడా కనిపించని ఐశ్వర్యా సడెన్ గా మీడియా సెన్సేషన్ గా మారింది.ఆమె మాజీ లవర్ ఆమె పై కేసు నమోదు చేసాడు.