ప్రముఖ దర్శకుడు, అతని భార్య దారుణ హత్య.. ఎవరు ఆ కిల్లర్!
తండ్రి వారసత్వంతో సినీ రంగంలోకి ప్రవేశించి సదరు వారసత్వాన్ని బలంగా చాటి చెప్పే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వాళ్ళల్లో 'రాబ్ రీనర్' కూడా ఒకరు. ఐదు దశాబ్దాలుగా హాలీవుడ్ సెల్యులాయిడ్ పై తనదైన ముద్ర వేసి హాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచ సినీ ప్రేమికులకి ఇష్టమైన దర్శకుడిగా మారారు. దిస్ ఈజ్ స్పైనల్ టాప్, స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, ఏ ఫ్యూ గుడ్ మెన్, ది అమెరికన్ ప్రెసిడెంట్, రూమర్ హాజ్ ఇట్, ఆల్బర్ట్ బ్రోక్స్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.