English | Telugu

ఇది మూడడుగుల బుల్లెట్టు

అది ఆరడుగుల బుల్లెట్టు... విడుదల అయిన నాటి నుంచి ఈ సాంగ్ సూపర్ హిట్. దీంతో ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల ద్రుష్టి ఈ బుల్లెట్ టైటిల్ పైన పడింది. ఆ బుల్లెట్ ఇన్స్ పిరేషన్ తో ఇప్పుడు మూడడుగుల బుల్లెట్ అనే సినిమా రాబోతోంది. ఇది ఒక విశేషం అయితే ఆ అర బుల్లెట్ బ్రహ్మానందం అని వార్తలు రావడం మరో విశేషం. ఎన్నో హిట్ చిత్రాలకి బ్రహ్మీ కామెడి సూపర్ టానిక్ గా నిలిచింది. ఇంకా బ్రహ్మానందానికి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ చాలా మంది పెద్ద హీరోలకు కూడా లేదేమో. హీరోల విషయంలో అభిమానులు వేరైనా కామెడికి మాత్రం అందరి బిగ్ హీరో బ్రహ్మానందమే. ఇంత క్రేజ్‌ ఉన్న ఈ స్టార్ క్రేజ్ ని పూర్తిగా వాడుకున్న సినిమా ఇంతవరకు రాలేదు. బ్రహ్మానందం హీరోగా గతంలో పలు సినిమాలు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేక పోయాయి. అయినా బ్రహ్మీకి హీరోగా ఛాన్స్ లు ఇంకా వస్తూనే వున్నాయి. బ్రహ్మానందం హీరోగా ‘మూడడుగుల బుల్లెట్‌’అనే సినిమా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడితో రూపొందుతున్న ఈ చిత్రం వివరాలు అస్సలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. భారీ లెవల్లో ఒకేసారి ఈ ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేయాలని యోచిస్తున్నారట. సినిమాలో అరగంట పాటే ఉన్నా తన కోసం అభిమానులను థియేటర్ కు వచ్చేలా చేయగలిగిన కమెడియన్ బ్రహ్మానందం. ఆయన హీరో వస్తున్నా ఈ మూడడుగుల బుల్లెట్టు చిత్రం ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి.