English | Telugu
ఈ సారి నో పూరి స్టొరీ
Updated : May 14, 2014
కథా, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం సింగిల్ కార్డులో ఇముడ్చుకుని సినిమాని సింగిల్ హాండెడ్ గా హ్యాండిల్ చేసే డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ హీరో గా ఆయన తీయబోయే చిత్రానికి మొదటిసారిగా కథ వేరే రచయిత అందిస్తున్నారు. ఎన్టీఆర్ చిత్రాలు అశోక్, ఊసరవెల్లికి కథలు అందించిన వక్కంతం వంశీనే ఈ సినిమాకు కూడా కథ రచయిత.అడిగిన పది రోజుల్లో సినిమా కథను అల్లేసే పూరీ మీద ఎన్టీఆర్ కి నమ్మకం తగ్గటం వల్లే బయిట కథని తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఎన్టీఆర్ ని ఓ కథతో వంశీ ఒప్పించి ఉండటంతో, అదే కథతో పూరీ డైరక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రం మే 20న ప్రారంభం కానుంది. పెద్ద హీరోతో సినిమా చేయటం ప్రధానం అనుకున్న పూరీ ఇమ్మీడియట్ గా కథ విని, డైలాగ్స్ రాసుకోవటానికి రెడీ అయిపోయారు. ఏమైనా ఇది కొత్త పరిణామమే అని చెప్పాలి. ఈ సినిమాకు ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా 'కుమ్మేస్తా' అని పెట్టినట్లు సమాచారం. చాలా కాలంగా కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, పూరీలకు ఈ చిత్రం మీద అంచనాలు భారీగానే ఉంటాయి. ఇక ఈ మూవీ 'ఆంధ్రావాలా'లా అవుతుందా లేక కలెక్షన్స్ తెచ్చిపెడుతుందా అనేది చూడాలి.