English | Telugu

హార్ట్ అటాక్ హీరోకి భయం పట్టుకుంది

జయం సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో నితిన్ తన కెరీర్ లో ఎన్నో పరాజయాలు చూశాడు. ఒకటి కాదు, రెండు కాదు వరసగా పధ్నాలుగు ఫ్లాపులు వచ్చినా తట్టుకొని మళ్లీ ఇండస్ట్రీలో సక్సెస్ ను రుచిచూశాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యింది సినిమాల తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్న నితిన్ ‘హార్ట్‌ ఎటాక్‌’ మూవీ విషయంలో యావరేజ్‌ రిజల్ట్‌ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ యావరేజ్ హిట్ మన హీరోలో బాగా స్ట్రాంగ్ భయం ఏమైనా కలిగించిందేమో, నెక్స్ట్ సినిమా కోసం డైరెక్టర్ లను తెగ ఇబ్బింది పెడుతున్నాడట.
నితిన్ తన దగ్గరకు కథలతో వచ్చిన డైరెక్టర్ లను ఒక పట్టాన ఓకే చేయటం లేదంట. ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా స్టార్ట్ చేసి, తనకు నచ్చినట్టు రావడం లేదని ఆ ప్రాజెక్టుని ఆపేశాడట. అంతే కాదు నందిని రెడ్డి, మారుతి లాంటి డైరెక్టర్ లు కూడా నితిన్ కి కథ చెప్పి ఒప్పించడానికి తెగ కష్ట పడుతున్నారట. మరోవైపు డైరెక్టర్ కరుణాకరన్ ఆరు నెలలుగా నితిన్ కి నచ్చేలా కథ రాసేందుకు ప్రయత్నిస్తునే ఉన్నాడట.
ఇప్పటికైతే నితిన్ కి నచ్చే కథలు ఎక్కడినుంచి తేవాలో తెలియక డైరెక్టర్లు తంటాలు పడుతున్నారు. కానీ ఇది ఇలాగే కొనసాగితే నితిన్ కి కథ చెప్పటం గురించే కాక, సినిమాలు తీయడానికి కూడా దర్శకులు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారేమో అని సినీవర్గాలు అనుకుంటున్నాయి.