English | Telugu
అమలా పాల్ ఇక యాక్టింగ్ చేయదేమో
Updated : May 15, 2014
బుట్ట బొమ్మలా ముద్దుగొలిపే అమలా పాల్ తెలుగులో కుర్ర హీరోలందరి పక్కన నటించేసింది. అంతటితో చాలు అనుకుందో ఏమిటో పెళ్లికి సయ్యంటోంది. సౌత్ డైరెక్టర్ విజయ్, అమలా పాల్ ను వివాహం చేసుకుంటున్నట్లు ముందే ప్రకటించారు. కానీ ఆ మధ్య కొన్ని కారణాల వల్ల పెళ్ళి ఆగిపోతోందని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ఇద్దరి మతాచారాలు వేరు కావడం పెళ్ళికి సమస్యగా మారిందని, చివరకు అంతా సర్దుకుని అమలా, విజయ్ ఒక్కటి కాబోతున్నారు. జూన్ 12 న వీరి వివాహ తేదీని ఖరారు చేశారు. ఈ జంట జూన్ 6 న కేరళలోని ఒక చర్చ్ లో ఎంగేజ్ మెంట్ జరుపుకోనున్నారు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి అని అమలా పాల్ సంతోషంగా ఉండి ఉంటుంది. కానీ ఇక్కడ యావత్ దక్షిణాదిలో ఆమెకు గల అభిమానులు మాత్రం పెళ్ళయ్యాక అమలా యాక్టింగ్ కి దూరమయితే ఎలా అని దిగులు పెట్టుకున్నారట.
దీనికి జవాబు అమలానే ఇవ్వాలి...