English | Telugu
బర్త్ డే డాల్ సన్నీ రియల్ సీక్రెట్స్..?
Updated : May 13, 2014
సన్నీ లియోన్.. కుర్రకారుకి ఆమె పేరు వినపడితే గిలిగింతలే. ఓర చూపుతో స్క్రీన్ ను శాసిస్తున్న ఈ స్పైసీ బేబి పుట్టిన రోజు ఈ రోజు. పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన ఈ హాట్ భామ జీవితం తెరిచిన పుస్తకం. పంజాబీ సిక్ కుటుంబానికి చెందిన సన్నీ అసలు పేరు కెరంజీత్ కౌర్. చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో హాకీ, స్కేటింగ్ ఆడుతూ పెరిగిన సన్నీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా బాహాటంగానే చెప్పుకుంటుంది. పోర్న్ స్టార్ గా చాలా కాలం కొనసాగిన ఈ భామ 2011 లో బిగ్ బాస్ షోతో ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. మహేష్ భట్, ఆయన కూతురు పూజా భట్ ఇచ్చిన అవకాశంతో సినీ రంగ ప్రవేశం చేసి ఈ రోజు బాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ బేబీ డాల్. 13 మే, 1981లో పుట్టిన ఈ సెక్సీ డాల్ మరింత కాలం ఇండియన్ స్క్రీన్ పై క్వీన్ గా కొనసాగుతుందనటంలో ఏ డౌటు లేదు..
సన్నీ గురించిన ఆసక్తికర అంశాలు...
మ్యాక్సిమ్ అనే పురుషుల మ్యాగజైన్ లో 2010లో ప్రచురించిన టాప్ 12 మంది పోర్న్ స్టార్ లలో ఒకరుగా నిలిచింది సన్నీ. 42 పోర్న్ చిత్రాలు డైరెక్ట్ చేసి 41 చిత్రాలలో నటించిన సన్నీ జిస్మ్ సినిమాలో గ్లిజరిన్ వాడకం గురించి తెలుసుకుంది. రాగిణి ఎంఎంఎస్ చిత్రంలో సన్నీ బోల్డ్ సీన్లలో నటించడానికి అస్సలు వెనకాడలేదట. కానీ సోర్స్ ప్రకారం అసలు ఆ సీన్ లు చిత్రంలో నుంచి తొలగించారట. బాలీవుడ్ లో సంచలనంగా మారిన సన్నీ ఒకప్పుడు ఒక బేకరీలో పనిచేసిందట. ఇండియాకు రావడానికి ముందు సంకోచించారా అని అడిగినప్పుడు, కేవలం సంకోచమే కాదు, భయపడ్డాను కూడా అని బదులిచ్చింది సన్నీ. యూఎస్ లోని ఇండియన్స్ ఆ సమయంలో తనకు హేట్ మెయిల్స్ పంపారని, కానీ ప్రస్తుతం వారంతా తనని చూసి హ్యాపీ గా ఫీల్ అవుతున్నారని తెలిపింది. సన్నీ లియోన్ తన కోస్టార్ డేనియల్ వెబర్ ని వివాహం చేసుకుంది. ఇప్పుడే ఆయనే తన మేనేజర్ గా, బిజినెస్ పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో చక్కటి, ఆరోగ్యంగా వుండే పాపని కనాలని కోరుకుంటున్నాని సన్నీ తెలిపింది. రాగిణి ఎంఎంఎస్ చిత్రంలో నటించిన సన్నీకి దెయ్యాలంటే ఎటువంటి భయం లేదంటా. కానీ పురుగులు అంటే ఫోబియా మాత్రం ఉందట. ఇక తన గురించి పూర్తిగా వివరిస్తు, తన పట్ల ఉన్న అభిప్రాయం మారడానికి సమయం పడుతుందని తనకు తెలుసని, అలాగే తన జీవితం పట్ల ఎటువంటి అపరాధ భావం తనకు లేదని అంది.