English | Telugu

ఐష్ పై మాజీ లవర్ కేసు..??

పెళ్ళైన తర్వాత ఎటువంటి వివాదాస్పద వార్తలకు చోటివ్వని ఐశ్వర్యా రాయ్, తల్లి అయిన తర్వాత సినిమాలకు కూడా దూరమయి మాతృమూర్తిగా తన పూర్తి సమయం ఇంటికే కేటాయిస్తోంది.అడపా దడపా కొన్ని ప్రకటనల్లో తప్ప మరెక్కడా కనిపించని ఐశ్వర్యా సడెన్ గా మీడియా సెన్సేషన్ గా మారింది.ఆమె మాజీ లవర్ ఆమె పై కేసు నమోదు చేసాడు. మాజీ లవర్ అనగానే సల్మాన్ ఖాన్ లేదా వివేక్ ఒబ్రాయ్ ఈ పని చేసాడు అని అనుకుంటే పొరపాటే. ఈతగాడి పేరు నిరోషణ్ దేవప్రియా. శ్రీలంక కు చెందిన ఈ ప్రేమికుడు ఐశ్వర్యా తో తనకు గతంలో ప్రేమానుబంధం ఉందని, ఆమె అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకోవడం వల్ల తానూ ఎంతో మానసిక ఒత్తిడికి గురి అయ్యానని కేసు నమోదు చేశాడు. ఐష్ కి పెళ్లై ఏడేళ్ళు అయ్యాక మనోడికి మానసికంగా బాధ కలగటం విడ్డూరంగానే కాదు, కామెడి గా కూడా ఉందంటున్నారు వార్తా విన్న వారంతా...2007 లో ఈ మాజీ విశ్వ సుందరి వివాహం జరిగినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాలు ముక్కలు అయిన మాట వాస్తవమే.కానీ ఏడేళ్ల తర్వాత ఆ బాధను ఇలా కేసు పెట్టి మరి చాటి చెప్పటం చూస్తే ఇదో పబ్లిసిటీ స్టంట్ కాబోలు అనిపించక మానదు.