English | Telugu

చక్రిది సహజ మరణం

టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి మృతి మీద ఏర్పడిన అనుమానాలన్నీ వీడిపోయాయి. చక్రికి తల్లిదండ్రులే విషం పెట్టి వుంటారని ఆయన భార్య, చక్రిని ఆయన భార్యే హత్య చేసిందని చక్రి తల్లిదండ్రులు పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చక్రిని దహనం చేయగా మిగిలిన అస్థికలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆయన అస్థికల్లో విషపదార్థాలు లేవని ఫోరెన్సిక్ పరీక్షలలో వెల్లడైంది. చక్రిది సహజమరణమే తప్ప అందులో అనుమానించాల్సిన విషయం ఏమీ లేదని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు.