English | Telugu

ఈ సంవత్సరం నందమూరి వారి సంవత్సరమే


నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘పటాస్‌’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. జనవరి 23న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీగా నిలిచింది. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులను కలుసుకుని చిత్రయూనిట్‌ తమ సంతోషాన్ని వారితో పంచుకున్నారు. ఒంగోలు, నెల్లూరు, బందరు, గుడివాడ, గుంటూరు, తిరుపతి, విజయవాడల్లో ఈ సక్సెస్‌ టూర్‌ కొనసాగింది. ఆదివారం విజయవాడలో విజయయాత్రను ఘనంగా ముగించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశర్వరావు, హీరో కళ్యాణ్‌రామ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయికార్తీక్‌, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్‌ అలంకార్‌ ప్రసాద్‌, ఎల్‌.వి.ఆర్‌. రాఘవ, శ్రీమన్నారాయణ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నందమూరి కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘దాదాపు పది సంవత్సరాలు తర్వాత పటాస్‌ విజయం దక్కింది. ఈ విజయం నాదని అందరూ అంటున్నారు. కానీ ఈ సక్సెస్‌ నాది కాదు మన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలది. అందుకే ఈ విజయాన్ని తెలుగు ప్రజలకు డేడికేట్‌ చేస్తున్నాను. ఈ సంవత్సరం నందమూరి వారి సంవత్సరమే అవుతుంది’’ అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.