English | Telugu

కోన వెంక‌ట్ వ‌చ్చాడు.. కెలికాడు

శ్రీ‌నువైట్ల సినిమాలంటే కోన వెంక‌ట్ పేరు త‌ప్ప‌కుండా వినిపిస్తుంది. బాద్ షా వ‌ర‌కూ క‌లిసే ప‌నిచేశారు. ఆ త‌ర‌వాత ఇద్ద‌రికీ విబేధాలొచ్చి.. ఆగ‌డుకు దూర‌మ‌య్యారు. ఇప్పుడు మ‌ళ్లీ రామ్‌చ‌ర‌ణ్ సినిమా కోసం కోన‌.. శ్రీ‌నువైట్ల గూటికి చేరాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న విబేధాల‌ను ప‌క్క‌న పెట్టి క‌ల‌సి ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. చ‌ర‌ణ్ కోసం రాసుకొన్న స్ర్కిప్టుని కోన‌కి చూపించాడు శ్రీ‌నువైట్ల‌. ఈ స్ర్కిప్టు చూసి కోన వెంక‌ట్ పెద‌వి విరిచాడ‌ని స‌మాచార‌మ్‌. సెకండాఫ్ బొత్తిగా బాలేదు, మార్చాల్సిందే అన్నాడ‌ట‌. దాంతో ఇప్పుడు సెకండాఫ్‌కి రిపేర్లు చేయ‌డం మొద‌లెట్టారు. సెకండాఫ్ మ‌ళ్లీ కొత్త‌గా రాయ‌డం కంటే... క‌థ‌నే మ‌ళ్లీ తిర‌గ‌రాయండి అని మెగ‌ాస్టార్ కూడా సూచించార‌ట‌. దాంతో ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఈ స్ర్కిప్టు ఎప్పుడు పూర్త‌వుతుందో, చ‌ర‌ణ్‌సినిమాఎప్పుడు మొద‌ల‌వుతుంది. కోన ఆల‌స్యంగా వ‌స్తే వ‌చ్చాడు... కానీ మొత్తం క‌థ‌నే కెలికేశాడు. ద‌టీజ్ కోన వెంక‌ట్.