సీబీఐ కొత్త ట్విస్ట్.. డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీఐ పోలీసులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. వీటిలో కుట్ర కోణం, కావాలని తిట్టడం, అక్రమ నిర్బంధం, చోరీ, బెదిరింపులు వంటి సెక్షన్లు ఉన్నాయి.